మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి | After income tax and PAN, Aadhaar mandatory to have a mobile phone connection | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

Published Sat, Mar 25 2017 1:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

న్యూఢిల్లీ : ఆధారే ఇక అన్నింటికీ ఆధారం అయిపోతుంది. పాన్ కార్డు దాఖలు చేయడానికి,  ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది.  మొబైల్ సబ్స్క్రైబర్లకు(పోస్టుపెయిడ్, ప్రీపెయిడ్) ఇచ్చిన అన్ని లైసెన్సులను ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియతో పునఃధ్రువీకరించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ)  ఆదేశించింది. 2018 ఫిబ్రవరి 6 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని టెలికాం కంపెనీలను ఆదేశిస్తూ డిఓటీ  ఓ ప్రకటన జారీచేసింది. ఈ తేదీ అనంతరం ఏదైనా మొబైల్ ఫోన్ నెంబర్ ఆధార్తో లింకయి లేకపోతే అవి అక్రమమైనవిగా నిర్ధారించాల్సి వస్తుందని పేర్కొంది.
 
కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు కూడా తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పద్ధతి ద్వారా పొందాలని  తెలిపింది. దేశంలోని అన్ని మొబైల్ నెంబర్ల యూజర్ల గుర్తింపునకు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ  ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత మొబైల్ యూజర్ల కనెక్షన్లకు ఆధార్ ను తప్పనిసరి చేసింది. అంతేకాక భవిష్యత్తులో సిమ్ కార్డు తీసుకోవాలనుకునే వారు కూడా ఆధార్ ఆధారిత  ఈ-కేవైసీ ద్వారానే జారీచేసేలా టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement