Airtel Chief Sunil Mittal Salary Package Fell Nearly 5 Percent In 2021-22, Details Inside - Sakshi
Sakshi News home page

Airtel Sunil Mittal Salary: ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మిట్టల్‌ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే

Published Mon, Jul 25 2022 10:02 AM | Last Updated on Mon, Jul 25 2022 12:38 PM

Airtel Chief Sunil Mittal Salary Package Decrease By 5 Percent - Sakshi

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ప్యాకేజీ 5 శాతం తగ్గింది. రూ. 15.39 కోట్లకు పరిమితం అయ్యింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 16.19 కోట్లుగా నమోదైంది. గత రెండేళ్లుగా ఆయన జీతాలు, ప్రోత్సాహకాలు యథాప్రకారంగానే ఉన్నప్పటికీ ..హోదాపరంగా లభించే కొన్ని ప్రయోజనాల విలువ కొంత తగ్గడమే మిట్టల్‌ ప్యాకేజీలో తగ్గుదలకు కారణం. 2020–21లో వీటి విలువ రూ. 1.62 కోట్లుగా ఉండగా తాజాగా ఇది రూ. 83 లక్షలకు పరిమితమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement