మెగా విలీనానికి భారతీ ఎంటర్‌ప్రైజ్ చెక్
మెగా విలీనానికి భారతీ ఎంటర్‌ప్రైజ్ చెక్
Published Fri, Aug 4 2017 9:35 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్, టాటా గ్రూప్ కంపెనీలతో చేసుకోబోతున్న మెగా విలీనానికి గండిపడింది. టాటా గ్రూప్ టెలికాం, ఓవర్‌సీస్ కేబుల్, ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్, డీటీహెచ్ టీవీ వ్యాపారాలతో మెగా డీల్ కుదుర్చుకోవాలని ప్లాన్‌ను భారతీ ఎంటర్‌ప్రైజ్ విరమించుకుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సునిల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఇప్పటికే తలకు మించిన అప్పులతో కొట్టుమిట్టాడుతుందని, దీంతో టాటా గ్రూప్‌తో మెగావిలీన ప్లాన్‌లను విరమించుకుని, కేవలం టవర్ సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్ వాటా విక్రయం, టెలినార్ ఇండియా టేకోవర్ వంటి విషయాలపై ప్రస్తుతం దృష్టిసారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
టెలినార్ ఇండియాను సొంతం చేసుకోబోతున్న ఎయిర్‌టెల్, టెలికాం మార్కెట్‌లో తీవ్ర పోటీ వాతావరణాన్ని సృష్టించబోతుంది. మరోవైపు ఐడియా, వొడాఫోన్లు ఓ విలీన సంస్థగా ఏర్పడబోతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌లో మూడోవంతు కన్నా ఎక్కువ కలిగి ఉన్న సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్ వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిందని, కానీ ప్రజా షేర్‌హోల్డర్స్, ప్రభుత్వం కలిగి ఉన్న వాటాదారుల విషయంలో మేజర్ 'మల్టి-ప్లాన్' కొనుగోళ్లను చేపడుతూ సంక్లిష్టతలు తీసుకురాకూడదని అనుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే భారతీ బోర్డే ఈ మెగా విలీనాన్ని తిరస్కరించిందా? అనేది ఇంకా తెలియరాలేదు. లిస్టెడ్ కాని టాటా టెలిసర్వీసెస్, టాటా స్కై, లిస్టు అయిన టాటా కమ్యూనికేషన్లను భారతీ ఎయిర్‌టెల్‌తో విలీనం చేయాలని ఇరువైపుల చర్చలు జరిగాయని తెలిసింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చాక ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.
ఎప్పడికప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ప్రస్తుతం ఏమీ లేనట్టు భారతీ ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. టాటా గ్రూప్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. మార్కెట్ రూమర్లపై తామేమీ కామెంట్ చేయమని సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటా టెలీ ఎయిర్‌వేస్‌ను ఎయిర్‌టెల్ దక్కించుకోవాలంటే 1.7 బిలియన్ డాలర్లను అది చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లతో కొనసాగుతున్న ఈ సంస్థకు ఇది అతిపెద్ద సవాలని ఇండస్ట్రి అధికారులు చెప్పారు. నష్టాల్లో ఉన్న టెలికాం వ్యాపారాలను అతిపెద్ద కంపెనీలో కలుపడం టాటాలకు ఓ అవకాశంగా పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ వ్యాపారాల నుంచి వైదొలగాలని టాటాలు చూస్తున్నారు. వొడాఫోన్‌తో కూడా చర్చలు జరిపారు. కానీ అవి సఫలం కాలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్‌గా వచ్చాక ఈ చర్చలకు తెరతీశారు.
Advertisement