రహమాన్, సచిన్‌లను వదిలి నాపై విమర్శలా
బాలీవుడ్ సీనియర్ బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్‌కు కోపం వచ్చింది. రియో ఒలింపిక్స్‌కు అతడిని గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించినప్పుడు.. అతడు క్రీడాకారుడు కాదు కదా, ఎందుకు పెట్టారన్న ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ లాంటివాళ్లు కూడా ఇదేం పిచ్చి పని అంటూ విమర్శించారు. ఒలింపిక్ కాంస్యపతక విజేత యోగేశ్వర్ దత్ సైతం తన అసంతృప్తిని ట్వీట్ల రూపంలో వెల్లడించాడు.
అయితే.. సల్మాన్ ఖాన్ మాత్రం దాన్ని సమర్థించుకుంటున్నాడు. ఏఆర్ రెహ్మాన్, సచిన్ టెండూల్కర్‌లను కూడా ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, వాళ్లు ఒలింపిక్స్‌లో ఇంతకుముందు పాల్గొన్నవాళ్లు కారని.. అలాంటప్పుడు వాళ్లను వదిలేసి తనపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. మరి క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా.. ఒలింపిక్స్ అంబాసిడర్‌గా ఎలా వెళ్తారని ప్రశ్నించిన మీడియాపై రుసరుసలాడాడు. దేశంలో చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయని, మరి వాళ్లను నాయకులుగా ఎలా ఉండనిస్తున్నారని ప్రశ్నించాడు. పైగా దేశం ముఖ్యమా ఒలింపిక్స్ ముఖ్యమా అని అడిగాడు. చాలామంది స్కాములు చేశారని, కొందరైతే హత్యలు, అత్యాచారాలు కూడా చేశారని.. అయినా వాళ్లను దేశ నాయకులుగా ఎలా ఆమోదిస్తున్నారని అడిగాడు.