goodwill ambassador
-
మంచి మనసుకు మన్నన
సాక్షి, చెన్నై: సేవాతత్వం, మానవీయత వెరసి మదురై బాలిక నేత్రను అందలం ఎక్కించింది. తన తండ్రి మోహన్‌తో కలిసి లాక్డౌన్ కష్టాల్లో ఉన్న బాధితుల్ని ఆదుకున్న ఆ బాలిక సేవాతత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ బాలికలోని మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పేదల్ని ఆదుకునే దిశగా ఎన్నో మావనతా హృదయాలు కదిలాయి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు సేవల్లో మునిగారు. మరెందరో వివిధ పనుల నిమిత్తం తాము దాచుకున్న సొమ్మును విరాళంగా అందించారు. ఈ పరిస్థితుల్లో మదురై మేలమడైకు చెందిన 9వ తరగతి విద్యార్ధిని నేత్ర(14) మంచి మనసు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. హెయిర్ కటింగ్ దుకాణం నడుపుతున్న నేత్ర తండ్రి మోహన్, కూతురు చదువుల కోసం దాచుకున్న రూ. 5 లక్షల్ని కష్టాల్లో ఉన్న పేదల సేవకు ఉపయోగించారని ప్రధాని వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా నేత్ర కుటుంబానికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా నేత్రకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అందింది. ఐరాస అంబాసిడర్‌గా.. నేత్ర సేవ, మానవీయత ఎల్లలు దాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం ఆ బాలికకు వరంగా మారింది. ఆమె సేవ, మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ అంబాసిడర్‌గా ప్రకటించింది. “గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్రను నియమిస్తూ శుక్రవారం ప్రకటన వెలువడింది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జెనీవాలో జరగనున్న సమావేశంలో పేదరికం గురించి నేత్ర ప్రత్యేక ప్రసంగం ఇవ్వబోతున్నారు. అలాగే, ఆమె విద్యా ఖర్చులకు లక్ష రూపాయల ‘డిక్సన్ స్కాలర్షిప్’ను మంజూరు చేసింది. అరుదైన ఆహ్వానంసపై నేత్ర ఆనందం వ్యక్తం చేసింది. మోదీ ప్రశంస, తాజాగా తనకు గౌరవం దక్కడం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, పేదరికం గురించి ఐరాస వేదిక మీద ప్రసంగించి అందర్నీ మన్ననలు పొందుతానని తెలిపారు. సేవా రంగంలో ముందుకు సాగాలన్న తన ఆకాంక్షకు ఐరాస ఆహ్వానం మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ఒక్క భారత దేశంలోని పేదరికం గురించి మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాల్లోని పేదరికం గురించి తన ప్రసంగం ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడుతూ.. ఇది తమిళనాడుకు ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. అందరికి నేత్ర ఆదర్శంగా నిలిచిందన్నారు. సేవాతత్వంతో ముందుకు సాగే వారికి ఇలాంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని నేత్ర చాటిందన్నారు. -
యూఎన్డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తన నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు. -
ఛస్.. ఆయన అంబాసిడర్ ఏంటి?
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. జింబాబ్వే అధ్యక్షడు రాబర్ట్ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రకటించించినట్లు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం ప్రకటించింది. దీంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ‘‘మానవ హక్కులను గౌరవించేవారిని ఈ స్థానంలో నియమించటం పరిపాటి. అలాంటిది ముగాబేను ఏ అర్హతతో ఎంపిక చేశారు’’ అంటూ అమెరికా ప్రశ్నలు గుప్పిస్తోంది. ఆయన పాలనలో జింబాబ్వే దారుణంగా నాశనం అయ్యింది. దీనికితోడు 93 ఏళ్ల ఆయన ఓ పెద్ద రోగిష్టి వ్యక్తి. తరచూ ఆరోగ్యం కోసం సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో సానుకూలత కూడా లేదు. ఆ లెక్కన్న ఆయన నియామకం ఆరోగ్య సంస్థ చేసిన ఓ తప్పిదం అని అమెరికా భద్రతా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క అమెరికానే కాదు.. ఐర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి సైమన్ హర్రిస్ కూడా ముగాబే నియామకాన్ని తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. గత వారం ఉరుగ్వేలో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఓ ప్రకటన చేసింది. అయితే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కావటంతోనే ఈ నియామకం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో జింబాబ్వే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాబర్ట్ ముగాబే.. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాడనే చెప్పుకుంటున్నారు. అయితే 37 ఏళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలు చేశాయి. అన్నిరంగాల్లో దేశం వెనకబడిపోయింది. అందుకే అమెరికాతో ఆయన సంబంధాలు ఏ మాత్రం బాగోలేవు. దీనికి తోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆయనపై ఆంక్షలు కూడా విధించింది. కాగా, ముగాబే నియామకం గురించి జింబాబ్వే మీడియా అధికారికంగా ప్రకటించకపోయినా.. జాతీయ మీడియా జింబాబ్వే హెరాల్డ్ పత్రిక మాత్రం ముగాబే సిగలో మరో ఘనత అంటూ వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే విమర్శలు పెల్లుబిక్కుతుండటంతో ఆయన నియామకంలో డబ్ల్యూహెచ్‌వో పునరాలోచన చేస్తోందన్న సమాచారం అందుతోంది. -
గుడ్‌విల్ అంబాసిడర్‌గా అగ్ర నటుడు
ముంబై: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయాసియాలో హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రుగ్మతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్ ఈ సందర్భంగా తెలిపారు. తన లాగా హెపటైటిస్‌తో ఎవరూ బాధపడకూడదనేదే ఆశయమని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. హెపటైటిస్ కారణంగా గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిని నివారించేందుకు అమితాబ్ బచ్చన్ సహకారం తీసుకుంటామని తెలిపారు. -
నాడు బానిస.. నేడు గుడ్ విల్ అంబాసిడర్
లండన్: ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో బంధీగా చిక్కి చిత్ర హింసలనుభవించి వారి చెరనుంచి బయటపడి తన లాంటి వారి విముక్తి కోసం పాటుపడుతోంది నదియా మురాద్(21). మహిళల ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా నదియా చేస్తున్న కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. 2014 లో ఇరాన్ లోని యాదిజి (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇంట్లోంచి ఎత్తుకెల్లారు. అడ్డొచ్చిన సోదరులను, తల్లిని కళ్ల ముందే చంపేశారు.ఆమెను సెక్స్ బంధీగా చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఐసిస్ నుంచి బయటపడిన ఆమె ఇరాక్ లో యాదిజి వర్గ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇరాక్ లో ఉగ్రవాదులు మహిళలను అపహరించడం, అడ్డొచ్చిన వారిని చంపడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని వరకు అపహరించారు.వారి చెరలో 4 వేల మంది మహిళలు బంధీలుగా ఉన్నారు. వారి విముక్తి కోసం తన జీవితం అంకితమని నదియా ప్రకటించారు. -
ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రజనీ కూతురు
-
ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రజనీ కూతురు
సూపర్ స్టార్ కూతురిగానే కాదు.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు, రజనీకాంత్ కుమార్తెలు. ఇప్పటికే సినీరంగంలోని పలు శాఖల్లో తమ ప్రతిభను చూపించిన రజనీ కుమార్తె ఐశ్వర్యా ధనుష్, సేవాకార్యక్రమాల్లో కూడా అదే స్థాయిలో పాల్గొంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్, ఐశ్వర్యా ధనుష్‌ను కొత్త ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఓ దక్షిణాది మహిళకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న విదేశీ సంస్థ దక్షిణాది మహిళను గుర్తించి గౌరవించటంపై పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాధ్యతలు తీసుకున్న ఐశ్వర్య ఆసియా దేశాల్లోని మహిళల సాధికారతకు కృషి చేయనున్నారు. -
'వివాదం కొనసాగాలని కోరుకున్నా'
ముంబై: రియో ఒలింపిక్స్ కు భారత్ తరపున తనను సుహృద్భావ రాయబారిగా నియమించడంపై చెలరేగిన వివాదం త్వరగా ముగియడం పట్ల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదం మరికొంత కాలం సాగితే బాగుండేది అన్నాడు. సల్మాన్ ఖాన్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించాన్ని పట్ల క్రీడాకారులు, నిపుణులు, విశ్లేషకులు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. క్రీడారంగానికి చెందిన వారు ఎవరూ దొరకలేదా అంటూ మండిపడ్డారు. ఈ వివాదం గురించి అడగ్గా.. సల్మాన్ విభిన్నంగా స్పందించాడు. 'ఈ వివాదం ఎక్కువకాలం కొనసాగాలని కోరుకున్నాను. ఎందుకంటే రియో ఒలింపిక్స్ గురించి అందరూ తెలుసుకుంటారు. సచిన్ క్రికెట్ ఆడతాడు, రెహ్మాన్ మ్యూజిక్ వాయిస్తాడు. వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడంపై ఎటువంటి వివాదం లేదు. నన్ను రాయబారిగా నియమించడంపై వివాదం చేయడం నిరుత్సాహపరిచింద'ని సల్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చాడు. -
న్యూస్‌లో వచ్చింది కానీ నన్నెవరూ అడుగలేదు!
ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండేందుకు తన పేరును కూడా పరిశీలిస్తున్నారని వస్తున్న కథనాలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పందించారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రందించలేదని ఆయన స్పష్టం చేశారు. 'మీడియాలో వచ్చినట్టు నాకు తెలిసింది. మీడియా అంతటా ఇవే కథనాలు ఉన్నాయి. గూగుల్ న్యూస్‌లోనూ ఇదే ఉంది. కానీ నన్నెవరూ సంప్రదించలేదు. నాకు ఎలాంటి ఈమెయిల్ రాలేదు. బహుశా నా మేనేజ్మెంట్కు ఈ విషయాన్ని చెప్పి ఉంటారేమో' అంటూ రెహ్మాన్ మంగళవారం ముంబైలో విలేకరులతో అన్నారు. తాను సంగీతం అందిస్తున్న హాలీవుడ్ సినిమా 'పీలే' ఆడియో విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నియామకాన్ని మిల్ఖాసింగ్, యోగేశ్వర్ దత్ వంటి క్రీడాకారులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పీటీ ఉషా, ఏఆర్ రెహ్మాన్ వంటి ప్రముఖుల్ని కూడా గుడ్‌విల్ అంబాసిడర్లుగా భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఏవోఏ) నియమించవచ్చునని కథనాలు వచ్చాయి. కాగా, గుడ్‌విల్ అంబాసిడర్‌గా సల్మాన్ నియామకాన్ని రెహ్మాన్ స్వాగతించారు. -
సచిన్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడు...
కోల్‌కతా: రియోడిజనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ నియామకంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తంచేశాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయాన్ని సమ్మతిస్తున్నట్లు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన వాళ్లలో ఒకరైన సచిన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి గంగూలీ తన మద్ధతు ప్రకటించాడు. తన నిర్ణయం ఏంటి అని ఎప్పుడూ అడుగుతుంటారని, ప్రతి విషయం మీద అభిప్రాయాలు ఇవ్వడాన్ని తాను నమ్మనని టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడైన గంగూలీ అభిప్రాయపడ్డాడు. అందుకే అలాంటి వాటిని పక్కనపెట్టి ముందుగా ఎంపికైన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడమే ఉత్తమ బాధ్యత అన్నాడు. 'సచిన్ దేశం కోసం ఇప్పటివరకూ ఎంతో చేశాడు. అతడు అద్భుతాలు చేసినందున నేడు భారత్ తరఫున రియో ఒలింపిక్స్ కు గానూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఐఓఏ నిర్ణయం సరైనది' అని గంగూలీ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. సల్మాన్ కు కూడా ఆ హోదా దక్కడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రియోలో గ్లామర్ తీసుకొస్తాడంటూ మద్ధతుగా గంగూలీ వ్యాఖ్యానించాడు. -
సల్మాన్‌తో పాటు సచిన్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పంపిన ఆహ్వానానికి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అంబాసిడర్‌గా ఉండేందుకు సచిన్ సుముఖత వ్యక్తం చేస్తూ మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేశాడు. దీనివల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు భారత జట్టుకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఐఓఏ ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. అలాగే మేటి షూటర్ అభినవ్ బింద్రాను కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కూడా ఐఓఏ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది. -
హీరోను ఎంపిక చేయడం కరెక్టేనా..?
న్యూఢిల్లీ: కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎంపిక వివాదంపై బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా ఎందుకు ఎంపిక చేశారని మిల్కా సింగ్ అనలేదని చెప్పాడు. ఆటగాడికి ఆ ఉన్నత పదవి కట్టబెడితే బాగుండేదని ఫర్హాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) రియో ఒలింపిక్స్ కు గానూ భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా గత శనివారం సల్మాన్ ను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఈ విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు, ఆటగాళ్లు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ కేవలం అభిప్రాయాన్ని వెల్లడించగా వివాదాస్పదమైందని ఫర్హాన్ వివరించాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉండగా, బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయడంపై మాత్రమే మిల్కా తన అసహనాన్ని వ్యక్తం చేశారని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నాడు. మిల్కా సింగ్ జీవిత కథాంశంతో రూపొందిన 'బాగ్ మిల్కా బాగ్' మూవీలో ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మిల్కా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగా ఫర్హాన్ స్పందించాడు. సల్మాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్, మిల్కా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ కారణం చేతనే మిల్కా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం అవుతున్నాయని ఆందోళన చెందాడు. అయితే తాను సల్మాన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, కేవలం గుడ్ విల్ అంబాసిడర్ అంశంపై మాత్రమే స్పందించానని చెప్పాడు. -
మరో స్టార్ ప్లేయర్‌కూ చాన్స్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందానికి స్ఫూర్తినిచ్చేందుకు గుడ్‌విల్ అంబాసిండర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పందించింది. సల్మాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించామో తమ వైఖరిపై వివరణ ఇచ్చింది. ఈ నియామకంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన లేదని, ఒలింపిక్ క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయనను అంబాసిడర్‌గా నియమించినట్టు తెలిపింది. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సల్మాన్‌ను నియమించడం వల్ల ఒలింపిక్ క్రీడల ప్రాధాన్యం దేశమంతటా తెలిసే అవకాశముందని, తద్వారా దేశంలోనూ ఈ విశ్వక్రీడలు పాపులర్ అయ్యే అవకాశముందని ఐవోఏ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా, కళల రంగాలకు చెందిన మరింత ప్రముఖులను గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమించే అవకాశముందని స్పష్టం చేసింది. క్రీడారంగాల్లో అంతర్జాతీయంగా సత్తా చాటిన పీటీ ఉషా, అంజు బాబీ జార్జ్‌లను కూడా అంబాసిడర్లుగా నియమించవచ్చునని ఐవోఏ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒలింపిక్స్‌లో భారతకు పతకాన్ని అందించిన పీటీ ఉషాను కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించే అవకాశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. -
'సల్మాన్ ఖాన్‌ను పీకేయండి'
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తాజాగా భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్ తప్పబట్టారు. ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్య ఆయనను తొలగించాలని అన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లే భారత్‌కు నిజమైన రాయబారులని, క్రీడా రాయబారిగా ఎవరినైనా నియమించాలని భావిస్తే.. వారు తప్పకుండా క్రీడారంగానికి చెందినవారై ఉండాలని ఆయన అన్నారు. ప్రముఖ రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న అర్హత ఏమిటని, ఆయనను రియో ఒలింపిక్స్ గుడ్ విల్ రాయబారిగా నియమించారని యోగేశ్వర్ దత్ ప్రశ్నించారు. -
నా హీరోలు వాళ్లే: సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది బ్రెజిల్లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరును ప్రకటించారు. 'ఈ రియో ఒలింపిక్స్ లో నా హీరోలు సానియా మిర్జా, సుశీల్ కుమార్, విజేందర్ సింగ్' అని కండలవీరుడు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. భారత క్రీడాకారునుద్దేశించి మాట్లాడుతూ... ఒలింపిక్స్ లో పాల్గొని భారత్ కోసం పతకాలు సాధించాలి, మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. భారత క్రీడాకారును కచ్చితంగా ప్రొత్సహించడంతో పాటు వారిలో ప్రేరణ కలిగిస్తానని సల్మాన్ చెప్పారు. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శన కనబరిచి దేశం ప్రతిష్టను పెంచుతారని చెప్పారు. సల్మాన్ ను నియమాకంపై బాక్సర్ మేరీ కోమ్ హర్షం వ్యక్తం చేశారు. సల్మాన్ తమ ఆటగాళ్లందరిని ప్రొత్సహిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. -
'గుడ్ విల్' రాయబారిగా ఫర్హాన్ అక్తర్
ముంబై: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్... ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం గుడ్ విల్ రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియాకు ఆయనను అంబాసిడర్ గా నియమించారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చరిత్రలో పురుషుడిని రాయబారిగా నియమించడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రారంభించిన హి ఫర్ షీ కార్యక్రమం కోసం ఫర్హాన్ అక్తర్ పనిచేయనున్నారు. లింగ సమానత, మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే తనంత తానుగా అత్యాచారం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. -
కేరళ జాతీయ క్రీడలకు సచిన్ బూస్ట్