'గుడ్ విల్' రాయబారిగా ఫర్హాన్ అక్తర్
ముంబై: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్... ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం గుడ్ విల్ రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియాకు ఆయనను అంబాసిడర్ గా నియమించారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చరిత్రలో పురుషుడిని రాయబారిగా నియమించడం ఇదే మొదటిసారి.
ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రారంభించిన హి ఫర్ షీ కార్యక్రమం కోసం ఫర్హాన్ అక్తర్ పనిచేయనున్నారు. లింగ సమానత, మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే తనంత తానుగా అత్యాచారం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.