UN Women
-
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
మహిళా వర్తకుల ఉత్పత్తులకు ప్రాధాన్యం
ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా దేశంలోని మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మహిళా సాధికారిత కోసం పనిచేసే సంస్థ యూఎన్ ఉమెన్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే 450 మందికి పైగా మహిళ వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన సుమారు 80 వేలకు పైగా ప్రత్యేక స్టోర్ ఫ్రంట్ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ మీద రూ.25లను దేశంలోని నిరుపేద బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎన్జీఓ ‘నన్హీ కలీ’కు తమ వంతు బాధ్యతగా విరాళం కింద అందజేస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారితో కలిగిన ఆర్ధిక విఘాతంతో మహిళల ఆదిపత్య రంగాలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని, మహిళలు జీవనోపాధి కోల్పోయే దశకు చేరిందని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. మహిళల్లో వ్యవస్థాపకత మెరుగైన ఆర్ధిక ఫలితాలను చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ అగర్వాల్ చెప్పారు. -
పురుషుల కంటే స్త్రీలే అధికంగా..
ఐక్యరాజ్యసమితి: మహమ్మారి కోవిడ్ కారణంగా, 2021లో దక్షిణాసియాలో మహిళల పేదరికం మరింత పెరగనున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న దశాబ్దంలో 25 –34 ఏళ్ల వయస్సుల వారిలో పురుషుల కంటే అధికంగా స్త్రీలే పేదరికం బారిన పడతారని ఆ సంస్థ వెల్లడించింది. గత దశాబ్దాలలో మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన కృషి, ఇప్పటి వరకు జరిగిన మహిళల అభివృద్ధి కోవిడ్ మహమ్మారి కారణంగా, తిరోగమనంవైపు మళ్లుతోందని తెలిపింది. ఫలితంగా 2021 నాటికి 4 కోట్ల 70 లక్షల మంది అదనంగా పేదరికం బారిన పడనున్నారని యుఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంస్థలు వెల్లడించాయి. (చదవండి: కరోనా వల్ల మహిళలకే ఎక్కువ రిస్క్: యూఎన్) కోవిడ్ కారణంగా దక్షిణాసియాలో స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా పెరిగిపోయి, మహిళలు మరింత పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘‘ఫ్రం ఇన్సైట్స్ టు యాక్షన్.. జెండర్ ఈక్వాలిటీ ఇన్ ది వేక్ ఆఫ్ కోవిడ్–19’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నాయి. కోవిడ్‌కి ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు 2021లో 10 శాతంగా అంచనావేయగా, ప్రస్తుతం అది 13 శాతంగా మారనుంది. 2021లో యావత్ ప్రపంచంలో, ప్రతి వంద మంది పేద పురుషులకు 118 మంది స్త్రీలు దారిద్య్రంలో ఉంటారని రిపోర్టు తెలిపింది. (చదవండి: ఆ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం) ఈ అంతరం 2030 నాటికి ప్రతి వంద మంది పురుషులకు 121 మంది స్త్రీల నిష్పత్తికి చేరనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ మహమ్మారి 2021 నాటికి 9.6 కోట్ల మందిని దుర్బర దారిద్య్రంలోకి నెడుతుండగా, అందులో 4.7 కోట్ల మంది స్త్రీలు, బాలికలే ఉంటారని ఈ రిపోర్టులో స్పష్టం అయ్యింది. మన సమాజం, ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో ఉన్న తప్పుడు విధానాల వల్ల ఈ అంతరాలు పెరుగుతున్నట్టు యుఎన్ వుమెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుంజిలే లాంబో నెకూకా తెలిపారు. మధ్య, దక్షిణ ఆసియా, సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 87 శాతం పేదరికం ఉండగా, ఇప్పుడు అదనంగా మధ్య ఆసియాలో 5.4 కోట్లు, దక్షిణాసియాలో 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ దిగువకు పడిపోనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. -
ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రజనీ కూతురు
-
'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు
న్యూయార్క్: లోక్‌సభ ఎంపీ కిరణ్ ఖేర్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఐక్యరాజ్య సమితికి చెందిన విమెన్ మిషన్‌కు అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 'హి ఫర్ షి' (ఆమె కోసం అతను) అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఆయనను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో షేర్ చేశారు. తనపై ఇంతటి గౌరవాన్ని ఉంచినందుకు యూఎన్ విమెన్ విభాగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ పురుష సమానత్వానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తనకప్పగించిన బాధ్యతను పరిపూర్ణం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని అధిగమించేందుకు పురుషులను, మగపిల్లలను భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంలో భాగమే 'హి ఫర్ షి' అనే కార్యక్రమం. యూఎన్ విమెన్ ఆధ్వర్యంలో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. స్త్రీ పురుష సమానత్వ సాధన, మహిళా హక్కుల సాధన ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే అనుపమ్ ఖేర్‌ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. కాగా 2014 జూలైలో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ యూఎన్ విమెన్ గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆమె ఆధ్వర్యంలోనే ఐక్యరాజ్యసమితి 'హి ఫర్ షి' ప్రచార కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి శ్రీకారం చుట్టింది. Two honors in 24hrs. To be invited for an exclusive birthday Party by my hero Robert De Niro & Champion Gender Equality by @UN_Women.:) — Anupam Kher (@AnupamPkher) August 19, 2015 Thank you @UN_Women again 4 honoring me at @UN headquarters NY. Will work tirelessly for Gender Equality.:)@HeforShe pic.twitter.com/WwgNi31B5L — Anupam Kher (@AnupamPkher) August 19, 2015 -
'గుడ్ విల్' రాయబారిగా ఫర్హాన్ అక్తర్
ముంబై: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్... ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం గుడ్ విల్ రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియాకు ఆయనను అంబాసిడర్ గా నియమించారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చరిత్రలో పురుషుడిని రాయబారిగా నియమించడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రారంభించిన హి ఫర్ షీ కార్యక్రమం కోసం ఫర్హాన్ అక్తర్ పనిచేయనున్నారు. లింగ సమానత, మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే తనంత తానుగా అత్యాచారం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.