'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు | Anupam Kher appointed UN ambassador for gender equality | Sakshi
Sakshi News home page

'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు

Published Wed, Aug 19 2015 1:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

'ఆమె కోసం అతను'  కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు

'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు

న్యూయార్క్: లోక్సభ ఎంపీ కిరణ్ ఖేర్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఐక్యరాజ్య సమితికి చెందిన విమెన్ మిషన్కు అంబాసిడర్గా నియమితులయ్యారు.  'హి ఫర్ షి' (ఆమె కోసం అతను) అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఆయనను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో షేర్ చేశారు. తనపై ఇంతటి గౌరవాన్ని ఉంచినందుకు యూఎన్ విమెన్ విభాగానికి ఆయన ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ పురుష సమానత్వానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తనకప్పగించిన బాధ్యతను  పరిపూర్ణం చేయడానికి తన శాయశక్తులా  ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు.
 
సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని  అధిగమించేందుకు పురుషులను, మగపిల్లలను భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంలో భాగమే 'హి ఫర్ షి' అనే కార్యక్రమం. యూఎన్ విమెన్ ఆధ్వర్యంలో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. స్త్రీ పురుష సమానత్వ సాధన,  మహిళా హక్కుల సాధన ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే అనుపమ్ ఖేర్ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది.  

కాగా 2014  జూలైలో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ యూఎన్ విమెన్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఆమె ఆధ్వర్యంలోనే ఐక్యరాజ్యసమితి 'హి ఫర్  షి' ప్రచార కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి శ్రీకారం చుట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement