UN ambassador
-
పాకిస్తాన్ పప్పులు ఉడకవు!
ఐక్యరాజ్య సమితి: చీకటి వ్యవహారాలు నడపడంలో రెండాకులు ఎక్కువే చదివిన పాకిస్తాన్ పప్పులు ఇకపై ఉడకబోవని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్లో జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్‌కు భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటు సమాధానమిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాంతిభద్రతల నిర్వహణపై బహిరంగ చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘‘చీకటి వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బృందం మరోసారి తన అసలు రూపాన్ని చూపింది. అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. వీటిని మేము ఖండిస్తున్నాం. పాకిస్థాన్‌కు నా ప్రతిస్పందన ఒక్కటే. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఇప్పటికైనా వాళ్లు తమ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. మీ కథలు నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు, తదనంతరం ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థలపై నిర్బంధం వంటి అంశాలను మునీర్ అక్రమ్ ప్రస్తావించారు. బాలాకోట్ దాడుల సందర్భంగా తాము వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను బందీగా చేసిన విషయాన్ని చెబుతూ.. భారత్ పాక్‌ల మధ్య ఘోర యుద్ధాన్ని నివారించాలంటే తక్షణమే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం కావడం, ఉగ్రవాదులు కొత్త ఆయుధాలు–టెక్నాలజీ సమకూర్చుకుంటుంటే నియంత్రించలేకపోవడం వంటి వాటిని మండలి లోపాలుగానే చూడాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన ఉద్దేశాల అమలుపై నిష్పక్షపాత సమీక్ష జరగాలని సూచించారు. ఇప్పటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా మండలిలో మార్పులు జరగాలని అన్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి ఛార్టర్ ఇప్పటికీ ప్రపంచ స్ఫూర్తికి ప్రతీకగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ సైన్యం శుక్రవారం ఎల్ఓసీ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. పూంఛ్ సెక్టార్లో సరిహద్దు వెంబడి పాక్ సైన్యం మోర్టార్లతో కాల్పులు జరిపిందని సైనికాధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. -
ట్రంప్ రెండో భార్య కోరిక ఏంటో తెలుసా?
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ రెండో భార్య మోడల్, నటి మర్లా మాపిల్స్(52) కూడా పదవిని ఆశిస్తున్నారు. ఆమె ఆఫ్రికా తరుపున ఐక్యరాజ్యసమితిలో రాయబారిగా పనిచేయాలని భావిస్తున్నారు. గత బుధవారం ఆమె ట్రంప్ టవర్స్ ఎదురుగా కనిపించారు. మర్లా, ట్రంప్‌లు 1993లో వివాహం చేసుకున్నారు. వీరి మధ్య బంధం ఆరేళ్లపాటు కొనసాగింది. 1999లో విడిపోయారు. వీరిద్దరికి టిఫాని అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఆ కూతురు ఆమెతోనే ఉంది. దాతృత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకునే మర్లా ప్రస్తుతం ఆఫ్రికాలోనే స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఇటీవలె ఆమె తన కూతురితో కలిసి అక్కడికి వెళ్లారని అధికార వర్గాల సమాచారం. అయితే, ట్రంప్ విజయం తర్వాత అమెరికా ప్రభుత్వం ద్వారా తనను ఆఫ్రికాలో ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఎంపిక చేయాలని కోరేందుకు ట్రంప్ టవర్స్ వద్దకు వచ్చినట్లు సమాచారం. -
'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు
న్యూయార్క్: లోక్‌సభ ఎంపీ కిరణ్ ఖేర్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఐక్యరాజ్య సమితికి చెందిన విమెన్ మిషన్‌కు అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 'హి ఫర్ షి' (ఆమె కోసం అతను) అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఆయనను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో షేర్ చేశారు. తనపై ఇంతటి గౌరవాన్ని ఉంచినందుకు యూఎన్ విమెన్ విభాగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ పురుష సమానత్వానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తనకప్పగించిన బాధ్యతను పరిపూర్ణం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని అధిగమించేందుకు పురుషులను, మగపిల్లలను భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంలో భాగమే 'హి ఫర్ షి' అనే కార్యక్రమం. యూఎన్ విమెన్ ఆధ్వర్యంలో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. స్త్రీ పురుష సమానత్వ సాధన, మహిళా హక్కుల సాధన ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే అనుపమ్ ఖేర్‌ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. కాగా 2014 జూలైలో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ యూఎన్ విమెన్ గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆమె ఆధ్వర్యంలోనే ఐక్యరాజ్యసమితి 'హి ఫర్ షి' ప్రచార కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి శ్రీకారం చుట్టింది. Two honors in 24hrs. To be invited for an exclusive birthday Party by my hero Robert De Niro & Champion Gender Equality by @UN_Women.:) — Anupam Kher (@AnupamPkher) August 19, 2015 Thank you @UN_Women again 4 honoring me at @UN headquarters NY. Will work tirelessly for Gender Equality.:)@HeforShe pic.twitter.com/WwgNi31B5L — Anupam Kher (@AnupamPkher) August 19, 2015