గుడ్‌విల్ అంబాసిడర్‌గా అగ్ర నటుడు
ముంబై: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయాసియాలో హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రుగ్మతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్ ఈ సందర్భంగా తెలిపారు. తన లాగా హెపటైటిస్‌తో
ఎవరూ బాధపడకూడదనేదే ఆశయమని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. హెపటైటిస్ కారణంగా గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిని నివారించేందుకు అమితాబ్ బచ్చన్ సహకారం తీసుకుంటామని తెలిపారు.