ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా రజనీ కూతురు | Rajinikanths Daughter Aishwarya gets a rare Honour | Sakshi
Sakshi News home page

ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా రజనీ కూతురు

Aug 27 2016 12:22 PM | Updated on Sep 4 2017 11:10 AM

ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా రజనీ కూతురు

ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా రజనీ కూతురు

సూపర్ స్టార్ కూతురిగానే కాదు.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు, రజనీకాంత్ కుమార్తెలు. ఇప్పటికే సినీరంగంలోని పలు శాఖల్లో తమ ప్రతిభను చూపించిన రజనీ కుమార్తె ఐశ్వర్యా ధనుష్, సేవాకార్యక్రమాల్లో...

సూపర్ స్టార్ కూతురిగానే కాదు.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు, రజనీకాంత్ కుమార్తెలు. ఇప్పటికే సినీరంగంలోని పలు శాఖల్లో తమ ప్రతిభను చూపించిన రజనీ కుమార్తె ఐశ్వర్యా ధనుష్, సేవాకార్యక్రమాల్లో కూడా అదే స్థాయిలో పాల్గొంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్, ఐశ్వర్యా ధనుష్ను కొత్త ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా ఎంపిక చేసింది.

ఓ దక్షిణాది మహిళకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న విదేశీ సంస్థ దక్షిణాది మహిళను గుర్తించి గౌరవించటంపై పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుడ్విల్ అంబాసిడర్గా బాధ్యతలు తీసుకున్న ఐశ్వర్య ఆసియా దేశాల్లోని మహిళల సాధికారతకు కృషి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement