భారత ఒలింపిక్ ప్లేయర్స్కు సల్మాన్ నజరానా
రియో ఒలింపిక్స్కు గుడ్ విల్ అంబాసిడర్గా ఎంపికై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు నష్టానివారణా చర్యలకు దిగాడు. పతకాలతో సంబందం లేకుండా ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన వంతుగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఒలింపిక్స్లో తొలి పతకంతో సాక్షి బోణి చేసిన కొద్ది సేపటికే సల్మాన్ ట్విట్టర్లో ఓ ప్రకటన చేశాడు.
ఒలింపిక్స్లో పథకం వేటలో పాల్గొన్న ప్రతీఒక్కరికి సపోర్ట్ గా నిలవాలన్న ఆలోచనతో, తన వంతుగా లక్షా పదివేల రూపాయలను అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. సల్మాన్ స్థాయికి లక్ష రూపాయలు అన్నది చిన్న మొత్తంలా కనిపించినా.. వంద మందికి పైగా క్రీడాకారులకు ఇంత మొత్తం అందించటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ఏడాది ఒలిపింక్స్లో 118 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా.. అందరికీ కలిపి కోటి ఒక లక్షా 18 వేల రూపాయలు ఇస్తున్నాడు సల్మాన్.