రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌కు మరో వారం రోజులే సమయం ఉండటంతో భారత అథ్లెట్లు బృందాలుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకటి, రెండు క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు బ్యాచ్‌లుగా తరలి వస్తున్నారు. గురువారం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా... ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. భారత అథ్లెట్ల సన్నాహాకాలపై ఆరా తీసిన థామస్... ముందుగానే ఇక్కడి చేరుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన చెఫ్ డి మిషన్ల సమావేశానికి హాజరైన గుప్తా... అథ్లెట్లకు సంబంధించిన నివేదికలను అందజేశారు. ఒలింపిక్ విలేజ్‌లో వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల గురించి మాట్లాడుతూ.. ‘శాఖాహార వంటకాలు చాలా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో అథ్లెట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కొత్త వంటకాలు కూడా ఇందులో చేర్చొచ్చు. రూమ్‌లు ఫర్వాలేదు.
రెండు రోజుల్లో చిన్నచిన్న పనులు కూడా పూర్తి అవుతాయి’ అని గుప్తా పేర్కొన్నారు. ఒలింపిక్ విలేజ్‌లో బ్రెజిల్ పక్కన భారత్‌కు చోటు కల్పించారు. కామన్ స్విమ్మింగ్ పూల్, ఒలింపిక్ ప్లాజా, జిమ్‌లు ఏర్పాటు చేశారు. షూటర్లు జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప, గురుప్రీత్ సింగ్, కైనాన్ చినాయ్, మానవ్‌జీత్ సింధూ, అపూర్వి చండేలా, సందీప్ కుమార్, అయోనికా పౌల్; వాకర్స్ కుశ్బీర్ కౌర్, సపనా పూనియా, సందీప్ కుమార్, మనీష్ రావత్; షాట్ పుటర్ మన్‌ప్రీత్ కౌర్; బాక్సర్ శివ్ తాపా, మనోజ్ కుమార్ ఇక్కడి చేరిన వారిలో ఉన్నారు. ఈవెంట్లు ఆలస్యంగా ఉన్న అథ్లెట్లు ఆగస్టు తొలి వారంలో ఇక్కడికి రానున్నారు. 15 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బృందాలుగా రియోకు భారత అథ్లెట్లు
Published Fri, Jul 29 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement
Advertisement