ఆనంద్ అదుర్స్ | Viswanathan Anand wins Candidates chess tournament, gets title shot vs Magnus Carlsen | Sakshi
Sakshi News home page

ఆనంద్ అదుర్స్

Published Sun, Mar 30 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

ఆనంద్ అదుర్స్

ఆనంద్ అదుర్స్

క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ సొంతం
 కార్ల్‌సన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత
 
 ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో మరో గేమ్ మిగిలి ఉండగానే విజేతగా నిలవడం ద్వారా మాగ్నస్ కార్ల్‌సన్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. నవంబర్ 5 నుంచి 25 వరకు జరిగే ఈ పోటీకి త్వరలో వేదికను ప్రకటిస్తారు.
 
  ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆనంద్.. గత ఏడాది కార్ల్‌సన్‌కు టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం కర్జాకిన్ (రష్యా)తో జరిగిన 13వ రౌండ్‌ను ఆనంద్ 91 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మొత్తం 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేత అయ్యాడు. ఆంద్రికిన్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), కర్జాకిన్ (రష్యా), అరోనియన్ (అర్మేనియా), మమెదైరోవ్ (అజర్‌బైజాన్) 6.5 పాయింట్ల తో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement