world chess championship title
-
ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ సంచలన నిర్ణయం
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (31) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది (2023) తన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. గత దశాబ్ద కాలంగా చెస్ ప్రపంచాన్ని మకుటం లేని మారాజులా ఏలుతున్న కార్ల్సన్.. గతేడాది (2021) ఛాంపియన్షిప్ సాధించిన అనంతరమే ఈ విషయమై క్లూ ఇచ్చాడు. తాజాగా తాను టైటిల్ డిఫెండ్ చేసుకోవట్లేదని ఇవాళ స్పష్టం చేశాడు. చెస్ ఛాంపియన్ హోదాపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన ఫ్రెండ్‌కు ఇచ్చిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కార్ల్సన్ గతేడాది ఇయాన్ నెపోమ్నియాచిపై ఐదో టైటిల్ నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, కార్ల్సన్ నిర్ణయంపై భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ స్పందించాడు. కార్ల్సన్ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 1975లో బాబీ ఫిషర్ కూడా ఇలాగే ఆటను మధ్యలోనే వదిలేశాడని, ఇలా చేయడం వల్ల చదరంగం క్రీడకు నష్టం జరుగుతుందని అన్నాడు. చదవండి: బాంబుల మోత నుంచి తప్పించుకొని పతకం గెలిచి.. -
షిరోవ్‌ను ఓడించిన భారత టీనేజర్
రిగా (లాట్వియా): భారత టీనేజి చెస్ ఆటగాడు అరవింద్ చితంబరం తన కెరీర్లోనే అతి భారీ విజయాన్ని సాధించాడు. 2000లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం విశ్వనాథన్ ఆనంద్‌తో పోటీపడి ఓడిన అలెక్సీ షిరోవ్‌ను ఈ 15 ఏళ్ల చెన్నై చిచ్చర పిడుగు కంగుతినిపించాడు. రిగా టెక్నికల్ యూనివర్సిటీ ఓపెన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో షిరోవ్‌పై అరవింద్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించి సత్తా చాటాడు. ఈ టైటిల్‌ను అర్మేనియాకు చెందిన మెల్కుమ్యాన్ (7.5 పాయింట్లు) దక్కించుకున్నాడు. -
ఆనంద్ అదుర్స్
క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ సొంతం కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్లో మరో గేమ్ మిగిలి ఉండగానే విజేతగా నిలవడం ద్వారా మాగ్నస్ కార్ల్సన్తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. నవంబర్ 5 నుంచి 25 వరకు జరిగే ఈ పోటీకి త్వరలో వేదికను ప్రకటిస్తారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆనంద్.. గత ఏడాది కార్ల్‌సన్‌కు టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం కర్జాకిన్ (రష్యా)తో జరిగిన 13వ రౌండ్‌ను ఆనంద్ 91 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మొత్తం 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేత అయ్యాడు. ఆంద్రికిన్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), కర్జాకిన్ (రష్యా), అరోనియన్ (అర్మేనియా), మమెదైరోవ్ (అజర్బైజాన్) 6.5 పాయింట్ల తో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.