న్యూఢిల్లీ: సెయింట్ లూసియా ఓపెన్ బ్లిట్జ్‌చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్‌ల పాటు అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ఒక గేమ్‌లో గెలిచి, 12 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా ఐదు గేముల్లో ఓడిపోయాడు. రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తొమ్మిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 13.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.