
'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమంలో మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ముచ్చటించనున్నారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
అలాగే సచిన్ తోపాటు ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా కూడా వినే అవకాశం ఉంది.
Being positive and setting your own goals...Happy to join PM @narendramodi on #MannKiBaat wishing students good luck for their Board exams!
— sachin tendulkar (@sachin_rt) February 28, 2016
Tune in at 11 AM. You can also hear it on the Mobile App. #MannKiBaat https://t.co/TYuxNNJfIf pic.twitter.com/jKnMs4Udal
— Narendra Modi (@narendramodi) February 28, 2016