
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరితో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ కేవలం 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో 14 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో... ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లతో అనీశ్ గిరి, సో వెస్లీ (అమెరికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.