ఆరో గేమ్‌లో ఓడ టం ఆనంద్‌కు మరో బాధాకరమైన అంశం. ఎండ్‌గేమ్ ను రూక్, పాన్‌తో ఆడటం వల్ల ఓ దశలో గేమ్ డ్రా దిశగా వెళ్లింది. అయితే ఆనంద్ 60వ ఎత్తు ఆర్‌ఏ4 వేసి తప్పిదం చేశాడు. దీనికి బదులుగా బీ4ను వేస్తే గేమ్ డ్రా అయ్యేది. ఇప్పుడు కార్ల్‌సెన్ 4-2 ఆధిక్యంలో ఉన్నాడు. ఓపెనింగ్‌లో విషీ దూకుడైన ఎత్తులతో అలరించాడు. నైట్‌ను త్యాగం చేస్తూ ఈ గేమ్‌కు కూడా బాగానే సిద్ధమయ్యాడు. అయితే కార్ల్‌సెన్ మాత్రం ఆనంద్‌కు అనుమానం రాకుండా భిన్నమైన ఎత్తుగడతో బరిలోకి దిగాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ కాస్త సానుకూల దృక్పథంతో ఆడాడు.
రూక్ ఎండ్ గేమ్‌లో బలవంతంగా పాన్‌ను త్యాగం చేశాడు. గేమ్ ముందుకెళ్లే కొద్దీ సాంకేతికంగా గేమ్‌ను డ్రా చేసుకోవడానికి భారత గ్రాండ్‌మాస్టర్ మరో పాన్‌ను చేజార్చుకున్నాడు. ఈ అశ్చర్యకరమైన ఎత్తును కార్ల్‌సెన్ మిస్సయ్యాడు. అయితే 60వ ఎత్తులో ఆనంద్ చేసిన తప్పిదంతో మలుపు తీసుకుంది.
60వ ఎత్తు దెబ్బ తీసింది
Published Sun, Nov 17 2013 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement