ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భాగంగా విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య బుధవారం జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది.
సోచి (రష్యా): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య బుధవారం జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. నల్లపావులతో ఆడగా, కార్ల్సన్ తెల్లపావులతో పోటీ పడ్డాడు.
నాలుగో గేమ్ ఫలితం తేలకపోవడంతో ఇరువురు క్రీడాకారులు రెండేసి పాయింట్లతో సముజ్జీలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో కార్ల్సన్, మూడో గేమ్ లో ఆనంద్ విజయం సాధించారు.