
న్యూఢిల్లీ: సింక్‌ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో గ్రిష్‌చుక్ (రష్యా), లాగ్రెవ్ (ఫ్రాన్స్)లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ఆనంద్‌కు ఆరో స్థానం లభించింది. గ్రిష్‌చుక్‌కు ఐదో స్థానం, లాగ్రెవ్‌కు ఏడో స్థానం లభించాయి.