హరికృష్ణపైనే ఆశలు | Harikrishna in hopes of squeezing | Sakshi
Sakshi News home page

హరికృష్ణపైనే ఆశలు

Published Fri, Sep 11 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

హరికృష్ణపైనే ఆశలు

హరికృష్ణపైనే ఆశలు

నేటి నుంచి ప్రపంచకప్ చెస్  బరిలో లలిత్ బాబు కూడా

 బాకు (అజర్‌బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సిద్ధమయ్యాడు. నేటి నుంచి ఇక్కడ జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 128 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సన్ మినహా ప్రపంచంలోని ప్రముఖ గ్రాండ్‌మాస్టర్లంతా బరిలో నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న హరి తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్ ఇల్లింగ్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు.

హరికృష్ణ కాకుండా మరో ఐదుగురు భారత ఆటగాళ్లు ఆదిబన్, సూర్య శేఖర్ గంగూలీ, విది త్ గుజరాతీ, సేతురామన్, ఎంఆర్ లలిత్ బాబు ఈ టోర్నమెంట్‌లో పోటీ పడుతున్నారు. తెలుగు కుర్రాడు లలిత్ బాబుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌లో అతను 18వ ర్యాంకర్ వోటాసెక్ (పోలండ్)తో తలపడతాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement