
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాన్‌స్టాన్‌టిన్ లుపులెస్కు (రొమేనియా)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన హరికృష్ణ, సోమవారం జరిగిన రెండో గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ 0.5–1.5తో ఆంద్రికిన్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. విదిత్–ఆధిబన్ (భారత్); ప్రజ్ఞానంద (భారత్)–క్రాసెన్‌కౌ (పోలాండ్) నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు హిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 0.5–1.5తో గునీనా (రష్యా) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment