fourth round
-
Candidates Chess Tournament: హంపి పరాజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్ న్యుర్గుల్ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగం నాలుగో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్ సంతోష్ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. -
Tata Steel Chess Tournament: ప్రజ్ఞానంద అద్భుతం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): గత ఏడాది గొప్పగా రాణించిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద కొత్త సంవత్సరంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగో రౌండ్ గేమ్‌లో సంచలనం సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ డింగ్ లిరెన్ (చైనా)పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో నల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో డింగ్ లిరెన్‌ను ఓడించాడు. తాజా ఫలితంతో ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్‌లో 2748.3 పాయింట్లకు చేరుకున్నాడు. దాంతో 2748 పాయింట్లతో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను రెండో స్థానానికి పంపించి భారత కొత్త నంబర్‌వన్‌గా ప్రజ్ఞానంద అవతరించాడు. అంతేకాకుండా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గానూ ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. వాస్తవానికి ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వరల్డ్ రేటింగ్స్‌ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్ రేటింగ్స్ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ టోరీ్నలోని తదుపరి రౌండ్లలో ప్రజ్ఞానంద తడబడితే మళ్లీ ఆనంద్ నంబర్‌వన్ అయ్యే అవకాశాలున్నాయి. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీని నిర్వహిస్తున్నారు. నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన విదిత్ 2 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో, గుకేశ్ 1.5 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీలో డింగ్ లిరెన్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ నెపోమ్నిíÙని ఓడించి డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. -
హరికృష్ణ పరాజయం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగం నాలుగో రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు పరాజయం ఎదురైంది. అమిన్ (ఇరాన్)తో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ తప్పనిసరిగా గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాడు. మరోవైపు విదిత్ (భారత్) 49 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై విజయం సాధించాడు. మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ ముందంజ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్లోకి ప్రవేశించాడు. కాన్స్టాన్టిన్ లుపులెస్కు (రొమేనియా)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన హరికృష్ణ, సోమవారం జరిగిన రెండో గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ 0.5–1.5తో ఆంద్రికిన్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. విదిత్–ఆధిబన్ (భారత్); ప్రజ్ఞానంద (భారత్)–క్రాసెన్‌కౌ (పోలాండ్) నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు హిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 0.5–1.5తో గునీనా (రష్యా) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
భారత్‌కు రెండో విజయం
ప్రపంచ పురుషుల టీమ్ చెస్ సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. హంగేరితో జరిగిన నాలుగో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో గెలి చింది. పెంటేల హరికృష్ణ, పీటర్ లెకో గేమ్ 22 ఎత్తుల్లో; సేతరామన్, ఎర్దోస్ గేమ్ 21 ఎత్తుల్లో; శశికిరణ్, అల్మాసీ గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. నాలుగో గేమ్‌లో విదిత్ 64 ఎత్తుల్లో రాపోట్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు. రష్యా చేతిలో భారత్ ఓటమి మరోవైపు చైనాలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది. రష్యా జట్టుతో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1.5-2.5 తేడాతో ఓడింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 60 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ను ఓడించగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా చేతిలో పరాజయం పాలైంది. పద్మిని రౌత్, అలెగ్జాండ్రా గొర్యాచికినాల మధ్య గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’ కాగా... సౌమ్య స్వామినాథన్ 76 ఎత్తుల్లో ఓల్గా గిర్యా చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ఐదో రౌండ్లో అమెరికాతో భారత్ తలపడుతుంది.