
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2.5–1.5తో విజయం సాధించిన భారత్... ఆ తర్వాత యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ తమ గేముల్లో గెలిచారు. ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించగా... విదిత్ ఓటమి చవిచూశాడు. యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విదిత్ తన గేమ్‌లో నెగ్గగా, హరికృష్ణ ఓడిపోయాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్‌లు ముగిశాక భారత్ నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment