
ఆనంద్ శుభారంభం
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో ఆనంద్ 49 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)పై గెలుపొందాడు. కర్జాకిన్ (రష్యా)-పీటర్ స్విద్లెర్ (రష్యా); నకముర (అమెరికా)-కరువానా (అమెరికా)ల మధ్య జరిగిన ఇతర తొలి రౌండ్ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అరోనియన్ (అర్మేనియా) కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది.