Tech Mahindra Global Chess League 2023: Anand Mahindra Shared Pic With Viswanathan Anand - Sakshi
Sakshi News home page

Global Chess League 2023 ఆనంద్‌ VS ఆనంద్‌: మహీంద్ర ట్వీట్‌ వైరల్‌

Published Thu, Jun 22 2023 1:16 PM | Last Updated on Thu, Jun 22 2023 2:35 PM

Global Chess League 2023 Anand Mahindra shared pic with Viswanathan Anand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్‌తో షేర్‌ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్‌లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్‌గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి.

ఆనంద్‌ VS ఆనంద్‌ గేమ్‌లో ఎవరు గెలుస్తారో గెస్‌ చేయండి.. కానీ గిఫ్ట్‌ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్‌ ఓపెనింగ్‌ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్‌ చేస్తూ. చెస్‌ బేస్‌ ఇండియా ఈ లీగ్‌కు  ఆరంభానికి సంబంధించిన ఫోటోలను  ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. ఆనంద్‌ వెర్సస్ ఆనంద్‌ అంటూ ట్వీట్‌ చేసింది. 

కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్‌-జూనియర్  జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో  చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆనంద్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement