
టీమిండియా క్రికెటర్ 'యజువేంద్ర చహల్', సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ 'ధనశ్రీ వర్మ' పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో చహల్.. ధనశ్రీకు భరణం కింద రూ. 4.75 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే భరణం డబ్బులో.. ట్యాక్స్ ఏమైనా చెల్లించాలా?, చెల్లిస్తే ఎంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
విడాకులు తీసుకోవడానికి ముందే చహల్.. ధనశ్రీకి రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన డబ్బు త్వరలోనే ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక దీనిపై ట్యాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుందా? అనే విషయానికి వస్తే.. భరణం ఒకేసారి చెల్లించినట్లయితే.. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నాన్ ట్యాక్సెసిబుల్ అసెట్‌గా పరిగణిస్తారు. ఇలాంటి వాటిపైన పన్నులు ఉండవు.
భరణం అనేది నెలవారీ లేదా ఏడాదికి చెల్లించినట్లయితే.. దాన్ని రెవెన్యూ రెసిప్ట్గా పరిగణిస్తారు. ఈ విధానంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే భరణం పొందిన వ్యక్తి వీటిని ఆదాయపు పన్ను రిటర్న్‌లో ప్రకటించాలి. ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి.
భరణం కాకుండా.. ఆస్తులను బదిలీ చేస్తే, అలాంటి వాటిపైన ట్యాక్స్ పడుతుంది. ఈ పన్నును భరణం పొందిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి ముందే, ఆస్తుల బదిలీ జరిగి ఉంటే.. దానిని గిఫ్ట్ కింద పరిగణిస్తారు. అప్పుడు మీరు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
భరణం అంటే ఏమిటి?
భార్య భర్తలు విడిపోయిన తరువాత.. జీవిత భాగస్వామి (భార్య) ఆర్థిక అవసరాలకు అందించే సహాయాన్ని భరణం అంటారు. భారతదేశంలో భరణం పొందటానికి.. హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డివోర్స్ యాక్ట్, ముస్లిం ఉమెన్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ వంటి అనేక చట్టాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!
భరణం ఇవ్వడానికి ముందు.. న్యాయస్థానం కూడా, అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో వివాహం సమయంలో వారి లైఫ్ స్టైల్, ఖర్చులు, వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?, పిల్లలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం చేసే భార్య జీతం.. భర్త జీతంతో సమానంగా ఉంటే, అప్పుడు భరణం తగ్గే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment