
మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్' (Shubman Gill). సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గిల్.. కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథనంలో శుభ్‌మన్ ఆస్తి ఎంత? ఎలాంటి వాహనాలను వినియోగిస్తున్నారు, ఏ కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు, అనే వివరాలు తెలుసుకుందాం.

శుభ్‌మన్ గిల్ అంటే టీమిండియా క్రికెటర్ మాత్రమే కాదు యూత్ ఐకాన్ కూడా. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇతను మొత్తం సంపద విలువ రూ. 32 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇతని వద్ద రూ. 89 లక్షల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, రూ. 14.16 లక్షల ఖరీదైన మహీంద్రా థార్ ఉన్నాయి.

మహీంద్రా థార్ కారును ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చారు. 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో ఆనంద్ మహీంద్రా ఆరుగురు ఆటగాళ్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గిల్ ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
శుభ్‌మన్ గిల్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో CEAT, Nike, Dior, Fiama, Gilette వంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. కాగా ఈయనకు పంజాబ్‌లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.