ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌: జియోస్టార్ సరికొత్త రికార్డ్ | JioStar New Records With India vs Pakistan ICC Champions Trophy | Sakshi

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌: జియోస్టార్ సరికొత్త రికార్డ్

Mar 7 2025 7:31 PM | Updated on Mar 7 2025 8:10 PM

JioStar New Records With India vs Pakistan ICC Champions Trophy

జియోస్టార్ టీవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్పోర్ట్స్ ప్రసార అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 'ఇండియా vs పాకిస్తాన్' మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఇది బీఏఆర్‌సీ చరిత్రలోనే ఎక్కువమంది వీక్షించిన రెండవ క్రికెట్ మ్యాచ్‌గా (వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) నిలిచింది.

2025 ఫిబ్రవరి 23న జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఈ సంఖ్య 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ఓడీఐ ప్రపంచ కప్ మ్యాచ్ కంటే దాదాపు 11% ఎక్కువ.  ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023లో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే రేటింగ్‌లలో 10% కంటే ఎక్కువ. వ్యూయ్స్ టైమ్ కూడా 2609 కోట్ల నిమిషాలుగా నమోదైంది.

భారతదేశంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలతో జియోస్టార్ కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, మా ప్రేక్షకుల సంఖ్యను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామని జియోస్టార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement