ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగుతుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం ససేమేర అంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించిందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కానీ భారత క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్‌లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది.
అయితే పీసీబీ కాండీషన్స్‌ను భారత బోర్డు తిరష్కరించినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్‌లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్‌లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.
కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్-19 జట్టు తరపున మాత్రం పాక్‌లో కోహ్లి ఆడాడు.
చదవండి: ‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment