పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.
టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని అభ్యర్దించింది. అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మొడల్‌లో యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.
సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!
స్పోర్ట్స్ టాక్ కథనం ప్రకారం.. ఐసీసీ డిమాండ్‌ను పీసీబీ అంగీకరించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తమకు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్‌ను లాక్ చేయనున్నట్లు సమాచారం.
ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్‌లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment