క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధాకరికంగా మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. పాకిస్తాన్ ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆశించినట్లే హ్రైబిడ్ మోడల్‌లో జరగనుంది.
భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్ ఫైనల్ కోసం ఐసీసీ రిజర్వే డేను కేటాయించింది. పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ రావల్పిండి మైదానాలు ఆతిథ్యమివ్వనున్నాయి.
దాయాదుల పోరు ఎప్పుడంటే?
ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా గ్రూపు-ఎలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్,పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. అదే విధంగా గ్రూపు-బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 19, 2025 (కరాచీ)- పాకిస్తాన్ vs న్యూజిలాండ్
ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్
ఫిబ్రవరి 21, 2025 (కరాచీ)- ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికా
ఫిబ్రవరి 22, 2025 (లాహోర్)- ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్
ఫిబ్రవరి 24, 2025 (రావల్పిండి)- బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్
ఫిబ్రవరి 25, 2025 (రావల్పిండి)- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
ఫిబ్రవరి 26, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 27, 2025 (రావల్పిండి)- పాకిస్తాన్ vs బంగ్లాదేశ్
ఫిబ్రవరి 28, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా
మార్చి 1, 2025 (కరాచీ) దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్
మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత
మార్చి 4, 2025 (దుబాయ్) సెమీ-ఫైనల్ A1 vs B2
మార్చి 5, 2025 (లాహోర్ )సెమీ-ఫైనల్ B1 vs A2
మార్చి 9, 2025 (లాహోర్) ఫైనల్
మార్చి 10, 2025 – దుబాయ్ రిజర్వ్ డే
👉ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment