![Real task is not just winning Champions Trophy but also beat India: Pakistan PM Sharif](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/pakistan_team3.jpg.webp?itok=HYia9EP4)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సమయం అసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌లో అందరి కళ్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం ఒక లెక్క.. ఈ దాయుదుల పోరు ఒక లెక్క. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య పాక్-భారత్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.
దీంతో ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ జట్టుకు దిశానిర్దేశం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఎంత ముఖ్యమో, టీమిండియాను ఓడించడం అంతే ముఖ్యమని షరీఫ్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బాగుంది. ఇటీవల కాలంలో ఆటగాళ్లు సైతం అద్బుతంగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి అసలైన సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా మన చిరకాల ప్రత్యర్ధి భారత్‌పై విజయం సాధించాలి. దేశం మొత్తం మీ వెనక ఉంది. అల్ ది బెస్ట్ అంటూ" షరీఫ్ పేర్కొన్నారు.
కాగా షరీఫ్ వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే.. ముందు గెలిచి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా గత రెండు ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌ను భారత్ మట్టికర్పించింది. వన్డే ప్రపంచకప్-2023లో దాయాదిని చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment