Subhman Gill
-
గిల్‌కు ఎంతో ప్రత్యేకం: బ్రిస్బేన్‌లో సారా టెండుల్కర్, ఇతర సెలబ్రిటీల సందడి
-
టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ
క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం కొత్తేం కాదు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి వస్తున్న రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతంలో సచిన్ కూతురితో పాటు హీరోయిన్‌తో రిలేషన్లో ఉన్నట్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా డిసెంబరులో ఓ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి కామెంట్స్‌పై సదరు హీరోయినే స్వయంగా స్పందించింది.(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)ఐపీఎల్, టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్.. మొన్నీమధ్యే జరిగిన జింబాబ్వే సిరీస్‌లోనూ భారత జట్టుకు కెప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా ఇతడి పెళ్లి గురించి ఓ రూమర్ తెగ వైరల్ అయింది. సీరియల్ హీరోయిన్ రిద్ధిమా పండిట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని అన్నారు. ఇదే ప్రశ్న రిద్ధిమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దాన్ని కొట్టేపారేసింది.'మా మధ్య ఎలాంటి బంధం లేదు. అతడు అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని తెలుసు. అంతే తప్ప అతడెవరో నాకు తెలియదు. ఒకవేళ అతడిని కలిస్తే మాత్రం ఈ రూమర్స్ గురించి చెప్పి నవ్వుకుంటాం. అతడు చాలా క్యూట్ ఉన్నాడు కానీ అలాంటిదేం (పెళ్లి) జరగదు' అని రిద్ధిమ చెప్పుకొచ్చింది. గతంలో గిల్.. సచిన్ కూతురు సారా, హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా నిజం కాదని తేలిపోయింది.(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్) -
గిల్, సాయి శతకాల మోత
అహ్మదాబాద్: గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్‌కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగారు.తుషార్ దేశ్‌పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జోరు కాదు... ఓపెనర్ల హోరు... పవర్ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్ 32 బంతుల్లో, గిల్ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. సెంచరీ మాత్రం ముందుగా శుబ్‌మన్ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్‌ను ఎట్టకేలకు డెత్ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన సాయి సుదర్శన్... శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్ వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్ గిల్ కూడా అవుట్ కావడంతో సూపర్‌కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్‌కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి. 14 ఫోర్లు, 13 సిక్స్‌లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది. ఆరంభంలోనే దెబ్బ తొలి ఓవర్లో రచిన్ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్ రుతురాజ్ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్‌కింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది. హిట్టర్ శివమ్ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ తొలుత ఈ ఘనత సాధించారు.100 శుబ్‌మన్ గిల్ శతకం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్‌లు జరిగాయి. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలి వికెట్‌కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (68 నాటౌట్), డికాక్ (140 నాటౌట్) తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) తుషార్ 103; శుబ్‌మన్ గిల్ (సి) జడేజా (బి) తుషార్ 104; మిల్లర్ (నాటౌట్) 16; షారుఖ్ ఖాన్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్: సాన్‌ట్నర్ 2–0–31–0, తుషార్ 4–0–33–2, శార్దుల్ 4–0–25–0, సిమర్జీత్ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్ 4–0–52–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) తెవాటియా (బి) సందీప్ వారియర్ 1; రచిన్ (రనౌట్) 1; రుతురాజ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; మిచెల్ (సి) షారుఖ్ (బి) మోహిత్ 63; అలీ (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ 56; దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21; జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18; ధోని (నాటౌట్) 26; సాన్‌ట్నర్ (బి) రషీద్ 0; శార్దుల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్: ఉమేశ్ 3–0–20–1, సందీప్ వారియర్ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్ అహ్మద్ 2–0–25–0, రషీద్ ఖాన్ 4–0–38–2, మోహిత్ 4–0–31–3. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ముంబై వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ అద్బుత క్యాచ్‌తో విండీస్ బ్యాటర్ రొమారియో షెపర్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్ ఆఫ్‌సైడ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. కోహ్లి క్యాచ్ చూసి పక్కన ఉన్న శుభ్‌మన్ గిల్ ఆశ్చర్యపోయాడు. అతడితో పాటు బ్యాటర్ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం(జూలై 29)న జరగనుంది. చదవండి: Hardik Pandya Run Out Video: అయ్యో హార్దిక్.. దురదృష్టమంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్ King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm — FanCode (@FanCode) July 27, 2023 -
కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేసాడు
-
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
టీమిండియాకు ‘శుబ్’ ఘడియలు వచ్చేశాయి..
‘ప్రతీ షాట్ అంతకంటే ముందు ఆడిన షాట్కంటే అందంగా కనిపించింది’... శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ గురించి ఏకవాక్య ప్రశంస ఇది. అందమే కాదు అద్భుతం అనిపించే షాట్లు కూడా అతను ఆడాడు. లేదంటే 182 పరుగుల స్కోరు నుంచి వరుసగా మూడు సిక్సర్లతో ‘డబుల్ సెంచరీ’కి చేరాలంటే ఎంత సాహసం ఉండాలి. బుధవారం హైదరాబాద్‌లో గిల్ దానిని చేసి చూపించాడు. శ్రీలంకతో సిరీస్ తొలి వన్డేలో గిల్ ఓపెనింగ్ చేస్తాడని... అంతకుముందు మ్యాచ్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఇషాన్ కిషన్‌కు చోటు లేదని రోహిత్ చెప్పడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు శుబ్‌మన్ వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. తన ఆటలో ఉండే వాడి ఏమిటో కూడా ప్రదర్శించి వన్డేల్లో తాను ఎందుకు సరైనవాడినో నిరూపించుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అతను ఈసారి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఫెర్గూసన్ వేసిన రెండో ఓవర్లో అతను కవర్స్ దిశగా కొట్టిన మొదటి ఫోర్ నిజంగా సూపర్. అలా మొదలైన పరుగుల లెక్క ఆపై జోరు అందుకొని ప్రవాహంలా మారింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అతని పుల్ షాట్లు, ఎక్స్ట్రా కవర్ మీదుగా డ్రైవ్‌లు, బ్యాక్ ఫుట్ పంచ్‌లు అత్యుత్తమ రీతిలో సాగాయి. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ సిక్స్‌తో 52 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కివీస్ బౌలర్లలో ఎవరినీ వదలకుండా అతను చితక్కొట్టాడు. 87 బంతుల్లో అతని సెంచరీ పూర్తయినప్పుడు ఆనందం కనిపించింది కానీ... మున్ముందు మరింత విధ్వంసం సృష్టించబోతున్నట్లు తనూ ఊహించి ఉండడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా, తను మాత్రం పట్టుదలగా నిలబడి స్వేచ్ఛగా పరుగులు సాధిస్తూ పోయాడు. 150 పరుగుల మైలురాయి కూడా సిక్సర్‌తోనే పూర్తయింది. చివరి ఓవర్లలో కివీస్ బౌలింగ్ అనూహ్యంగా మెరుగైంది. పరుగులు రావడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో టక్నర్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్... రెండు సిక్స్‌లతో గిల్ చెలరేగిపోయాడు. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్... తొలి మూడు బంతుల్లో ఫైన్ లెగ్, లాంగాఫ్, లాంగాఫ్...వరుసగా మూడు సిక్సర్లు... 145 బంతుల్లో డబుల్ సెంచరీ... అరుదైన మైలురాయిని దాటిన గిల్ గర్జిస్తూ విజయనాదం చేశాడు. 58 బంతుల్లోనే తర్వాతి వంద అతని ఖాతాలో చేరింది. తర్వాతి ఓవర్లోనూ మరో సిక్స్ కొట్టిన అనంతరం ఫిలిప్స్ క్యాచ్‌తో ఒక గొప్ప ఇన్నింగ్స్‌కు ముగింపు లభించింది. మైదానంలో 31,755 మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తిస్తుండగా ఈ పంజాబీ స్టార్ మైదానం వీడాడు. జట్టులో తర్వాతి స్కోరు 34 మాత్రమే అంటే గిల్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. పంజాబ్‌లో జిల్లా స్థాయి అండర్–16 పోటీల్లోనే 351 పరుగులు బాది అందరినీ ఆశ్చర్యపర్చిన గిల్, విజయ్ మర్చంట్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో వెలుగులోకి రాగా... వరుసగా రెండేళ్లు బీసీసీఐ బెస్ట్ జూనియర్ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో అండర్ –19 స్థాయిలో భారీ స్కోర్లు సాధిస్తూ 2018లో అండర్–19 వరల్డ్‌కప్ విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాక గిల్‌కు ఎదురు లేకుండా పోయింది. టెస్టుల్లో ఇప్పటికే తన స్థానం సుస్థిరం చేసుకున్న గిల్‌కు సీనియర్ల గైర్హాజరులో వన్డేల్లో ఇటీవల అవకాశాలు వచ్చాయి. వాటిని సమర్థంగా అందిపుచ్చుకొని ఇప్పుడు తనను తప్పించే అవకాశంలేని స్థితికి వచ్చాడు. 23 ఏళ్లకే పలు ఘనతలు సాధించి గిల్ మున్ముందు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. –సాక్షి క్రీడా ప్రతినిధి -
County Championship: సెంచరీ దిశగా శుబ్‌మన్ గిల్..
హోవ్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ససెక్స్ జట్టుతో సోమవారం మొదలైన డివిజన్–2 నాలుగు రోజుల మ్యాచ్‌లో గ్లామోర్గన్ జట్టుకు ఆడుతున్న శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి చేరువయ్యాడు. మరో తొమ్మిది పరుగులు సాధిస్తే గిల్ శతకం పూర్తవుతుంది. వెలుతురు మందగించి తొలి రోజు ఆటను నిలిపివేసే సమయానికి గ్లామోర్గన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో మూడు వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఓపెనర్ డేవిడ్ లాయిడ్ (64 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం గిల్‌తోపాటు బిల్లీ రూట్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు! -
సికిందర్ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే!
హరారే వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా సెంచరీ సాధించి ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. 9 బంతుల్లో 15 పరుగులు కావల్సిన నేపథ్యంలో రజా ఔట్ కావడంతో భారత విజయం లాంఛనమైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా(115) సెంచరీతో చెలరేగగా.. విలియమ్స్ 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక సెంచరీతో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెంచరీతో చేలరేగిన గిల్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. కాగా గిల్‌కు ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. A job well done. Congratulations team India on the clinical series win 👏🏽 🇮🇳 Also @SRazaB24 is a special player, gave the passionate Harare crowd lots to cheer @ZimCricketv 👌🏽🇿🇼 #ZIMvIND pic.twitter.com/3AXaxoLzc1 — Wasim Jaffer (@WasimJaffer14) August 22, 2022 చదవండి: IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు! -
వన్డేల్లో గిల్ అరుదైన ఫీట్.. మూడో భారత ఆటగాడిగా!
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 33 పరుగులు చేసిన గిల్ ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శ్రేయాస్ అయ్యర్(416 పరుగులు), నవజ్యోత్ సింగ్ సిద్ధూ (414) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడిన గిల్ 369 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వన్డేల్లో దుమ్ము రేపిన గిల్..జింబాబ్వేపై కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో 82 పరుగులతో అదరగొట్టిన గిల్.. రెండో వన్డేలో 33 పరుగులతో రాణించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జింబాబ్వేపై భారత్ 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది. చదవండి: IND vs ZIM: 'ఎందుకు రాహుల్ ఓపెనర్‌గా వచ్చావు.. గోల్డెన్ ఛాన్స్ కోల్పోయావుగా' -
IND Vs WI 3rd ODI: విండీస్‌పై భారత్ గెలుపు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా... కుర్రాళ్లు సత్తా చాటడంతో విండీస్‌ను 3–0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండు హోరాహోరీ వన్డేల తర్వాత చివరి పోరులో ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 119 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) విండీస్‌ను చిత్తు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను కుదించారు. ముందుగా భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (98 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శిఖర్ ధావన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం డక్‌వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అయితే విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెండన్ కింగ్ (37 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. సిరాజ్ తన తొలి ఓవర్లోనే మేయర్స్ (0), బ్రూక్స్ (0)లను అవుట్ చేయడంతో ‘సున్నా’కే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. యజువేంద్ర చహల్ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... సిరాజ్, శార్దుల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 64, 43, 98 నాటౌట్ (మొత్తం 205) పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. విండీస్ గడ్డపై ఆ జట్టును వన్డేల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇదే తొలిసారి. -
"టీమిండియా ఓపెనర్‌గా గిల్ వద్దు.. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి"
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ టెస్టుల్లో మూడు లేదా నాలుగో స్థానానికి సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బంతి స్వింగ్ అయితే ఆడటానికి గిల్ ఇబ్బంది పడుతున్నాడని చోప్రా తెలిపాడు. కాగా గిల్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో ఎక్కువ భాగం ఓపెనర్‌గానే ఉన్నాడు. ఇక జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఏకైక టెస్టులో కూడా గిల్ భారత తరపున ఓపెనింగ్ చేయునున్నాడు.. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టుకు గిల్ భారత ఓపెనర్లలో ఒకడిగా ఉండబోతున్నాడు. కానీ అతడు ఓపెనర్‌గా అంతగా రాణించలేడని నేను భావిస్తున్నాను. అతడు మూడు లేదా నాలుగో స్థానంలో అత్యుత్తమంగా ఆడగలడు. మ్యాచ్ ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అటు వంటి సమయంలో పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఒకే వేళ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడితే.. అతడు ఒక మ్యాచ్‌లో విఫలమైనా తర్వాత తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పడు ఇంగ్లండ్‌తో ఒకే ఒక టెస్టు ఆడనున్నారు" అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ ..
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో.. ఎవిన్ లూయిస్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరిగెత్తుతూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. అదే విధంగా కెప్టెన్ కెఎల్ రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: IPL 2022: కొత్త టీమ్, కొత్త కెప్టెన్.. తొలి మ్యాచ్.. తొలి బంతికే లక్నోకు షాక్! -
శుభ్‌మాన్ గిల్ అజేయ శతకం
మూడో వన్డేలో భారత్ విజయం ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో సిరీస్ ముంబై: ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (157 బంతుల్లో 138 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. భారత లెగ్ స్పిన్నర్ రాహుల్ చహల్ (4/33), లెఫ్టార్మ్ స్పిన్నర్ అనుకూల్ రాయ్ (3/39) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. ఇంగ్లండ్ తరఫున రాలిన్స్ (96; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీని చేజార్చుకోగా... బార్ట్లెట్ (55; 6 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. రాహుల్ చహల్ బౌలింగ్‌లో బార్ట్లెట్ అవుటయ్యాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (50 బంతుల్లో 37 నాటౌట్)తో కలిసి శుభ్‌మాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. సిరీస్‌లో నాలుగో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది.