Ind Vs WI, 1st ODI: Kohli's one handed stunner leaves WI batter dumbstruck - Sakshi
Sakshi News home page

IND vs WI: కోహ్లి సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్‌

Published Fri, Jul 28 2023 11:05 AM | Last Updated on Fri, Jul 28 2023 11:19 AM

Kohlis one handed stunner leaves WI batter dumbstruck - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్‌ అద్బుత క్యాచ్‌తో విండీస్ బ్యాటర్‌ రొమారియో షెపర్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్‌ ఆఫ్‌సైడ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. కోహ్లి క్యాచ్‌ చూసి పక్కన ఉన్న శుభ్‌మన్ గిల్ ఆశ్చర్యపోయాడు. అతడితో పాటు బ్యాటర్‌ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. విండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ షై హోప్‌ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం(జూలై 29)న జరగనుంది.
చదవండిHardik Pandya Run Out Video: అ‍య్యో హార్దిక్‌.. దురదృష్ట​మంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement