క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం కొత్తేం కాదు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి వస్తున్న రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతంలో సచిన్ కూతురితో పాటు హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా డిసెంబరులో ఓ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి కామెంట్స్‌పై సదరు హీరోయినే స్వయంగా స్పందించింది.
(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)
ఐపీఎల్, టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్.. మొన్నీమధ్యే జరిగిన జింబాబ్వే సిరీస్‌లోనూ భారత జట్టుకు కెప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా ఇతడి పెళ్లి గురించి ఓ రూమర్ తెగ వైరల్ అయింది. సీరియల్ హీరోయిన్ రిద్ధిమా పండిట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని అన్నారు. ఇదే ప్రశ్న రిద్ధిమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దాన్ని కొట్టేపారేసింది.
'మా మధ్య ఎలాంటి బంధం లేదు. అతడు అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని తెలుసు. అంతే తప్ప అతడెవరో నాకు తెలియదు. ఒకవేళ అతడిని కలిస్తే మాత్రం ఈ రూమర్స్ గురించి చెప్పి నవ్వుకుంటాం. అతడు చాలా క్యూట్ ఉన్నాడు కానీ అలాంటిదేం (పెళ్లి) జరగదు' అని రిద్ధిమ చెప్పుకొచ్చింది. గతంలో గిల్.. సచిన్ కూతురు సారా, హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా నిజం కాదని తేలిపోయింది.
(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్)
Comments
Please login to add a commentAdd a comment