Ridhima
-
టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ
క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం కొత్తేం కాదు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి వస్తున్న రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతంలో సచిన్ కూతురితో పాటు హీరోయిన్‌తో రిలేషన్లో ఉన్నట్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా డిసెంబరులో ఓ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి కామెంట్స్‌పై సదరు హీరోయినే స్వయంగా స్పందించింది.(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)ఐపీఎల్, టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్.. మొన్నీమధ్యే జరిగిన జింబాబ్వే సిరీస్‌లోనూ భారత జట్టుకు కెప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా ఇతడి పెళ్లి గురించి ఓ రూమర్ తెగ వైరల్ అయింది. సీరియల్ హీరోయిన్ రిద్ధిమా పండిట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని అన్నారు. ఇదే ప్రశ్న రిద్ధిమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దాన్ని కొట్టేపారేసింది.'మా మధ్య ఎలాంటి బంధం లేదు. అతడు అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని తెలుసు. అంతే తప్ప అతడెవరో నాకు తెలియదు. ఒకవేళ అతడిని కలిస్తే మాత్రం ఈ రూమర్స్ గురించి చెప్పి నవ్వుకుంటాం. అతడు చాలా క్యూట్ ఉన్నాడు కానీ అలాంటిదేం (పెళ్లి) జరగదు' అని రిద్ధిమ చెప్పుకొచ్చింది. గతంలో గిల్.. సచిన్ కూతురు సారా, హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా నిజం కాదని తేలిపోయింది.(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్) -
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
గత కొన్నాళ్ల నుంచి క్యాస్టింగ్ కౌచ్, సెట్స్‌లో ఎదురవుతున్న వేధింపుల గురించి పలువురు నటీమణులు బయటపెడుతున్నారు. తమకు ఎదురైన అనుభవాలు చెప్పి షాకిస్తున్నారు. తాజాగా హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఓ నిర్మాత ఈమెతో సెట్లోనే వేధిస్తున్నట్లు ఈమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈమెకు మద్ధతు తెలిపిన మరో సీరియల్ నటి రిద్ధిమ పండిట్.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?)'ఆమెకు (కృష్ణ ముఖర్జీ) జరిగింది నిజంగా దారుణం. ఇలా ఎవరికీ జరగకూడదు. అయితే జరిగిన ఇబ్బంది గురించి ఆమె బయటకు చెప్పినందుకు హ్యాట్సాఫ్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు.. నటీనటుల్ని చాలా వేధిస్తున్నారు. ఒత్తిడికి గురిచేస్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్.. మేము వాళ్ల సొంతమైనట్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేం వాళ్లు తీసే సీరియల్స్ కోసం కష్టపడుతున్నామని వాళ్లు గుర్తుంచుకోవాలి''అయితే షూటింగ్స్‌లో ఇలాంటివి జరుగుతున్నప్పటికీ చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. గతంలో నాకు కూడా ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాలా వేధించాడు. అది కూడా మా అమ్మకు బాగోలేక ఆస్పత్రిలో చేర్పించిన టైంలో. ఆమె ఐసీయూలో ఉంది. విజిటింగ్ అవర్స్ ఉదయం 7-8 వరకు సాయంత్రం 4-5:30 గంటల వరకు ఉండేవి. నేను అమ్మని పరామర్శించి, షూటింగ్‌కి ఉదయం 9 గంటలకు వస్తానన్నా.. పోని ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం త్వరగా వెళ్లిపోతానన్నా సరే అనుమతి ఇచ్చేవాడు కాదు. దీని గురించి బయటకు చెబుదామంటే నాపై లేనిపోని పుకార్లు సృష్టించారు. అయితే చాలామంది వీటి గురించి పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే చేస్తున్న పని పోతాదేమోనని భయం' అని రిద్ధిమా పండిట్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్) -
బియాస్లో విగత జీవిగా జగదీష్
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గురువారం మరో మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్‌కు చెందిన జగదీశ్దిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకూ 19 మృతదేహాలు బటయపడ్డాయి. కాగా జగదీష్ ముదిరాజ్ (20) మృతదేహం లభ్యం కావటంతో అతని ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్లోని బంగారు మైసమ్మ బస్తీలో జగదీష్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. తండ్రి మల్లేష్ కొకొకోలా కంపెనీలో పని చేస్తున్నారు. జగదీష్ రెండో కుమారుడు. క్షేమంగా వస్తాడనుకున్న తమ కుమారుడు విగతజీవిగా మారటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బియాస్ నదిలో 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంత అయిన విషయం తెలిసిందే. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
బియాస్లో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో గల్లంతైన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జరుపుతున్న గాలింపులో బుధవారం మరో మృతదేహం లభ్యమైంది. దీంతో 18 మంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. కాగా, బుధవారం లభ్యమైన మృతదేహం రిధిమా పాపానిదిగా గుర్తిం చారు. గల్లంతైన వారిలో ఇద్దరు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలతోపాటు టూర్ ఆపరేటర్ జాడ తెలియాల్సి ఉందన్నారు. రిధిమా మృతదేహాన్ని గురువారం విమానంలో తిరుపతికి పంపిస్తున్నారు. విద్యార్థులందరి మృత దేహాలు కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు అక్కడే ఉండాలని పర్యవేక్షణాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధితులకు రూ.5 లక్షల పరిహారమివ్వండి సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 24 మంది హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్జీ ప్రాజెక్టు నిర్వాహకులు, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం కలిసి చెరిసగం చొప్పున ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మిర్, న్యాయమూర్తి జస్టిస్ తర్లోక్‌సింగ్ చౌహాన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది.