గత కొన్నాళ్ల నుంచి క్యాస్టింగ్ కౌచ్, సెట్స్‌లో ఎదురవుతున్న వేధింపుల గురించి పలువురు నటీమణులు బయటపెడుతున్నారు. తమకు ఎదురైన అనుభవాలు చెప్పి షాకిస్తున్నారు. తాజాగా హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఓ నిర్మాత ఈమెతో సెట్‌లోనే వేధిస్తున్నట్లు ఈమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈమెకు మద్ధతు తెలిపిన మరో సీరియల్ నటి రిద్ధిమ పండిట్.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని రివీల్ చేసింది.
(ఇదీ చదవండి: హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?)
'ఆమెకు (కృష్ణ ముఖర్జీ) జరిగింది నిజంగా దారుణం. ఇలా ఎవరికీ జరగకూడదు. అయితే జరిగిన ఇబ్బంది గురించి ఆమె బయటకు చెప్పినందుకు హ్యాట్సాఫ్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు.. నటీనటుల్ని చాలా వేధిస్తున్నారు. ఒత్తిడికి గురిచేస్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్.. మేము వాళ్ల సొంతమైనట్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేం వాళ్లు తీసే సీరియల్స్ కోసం కష్టపడుతున్నామని వాళ్లు గుర్తుంచుకోవాలి'
'అయితే షూటింగ్స్‌లో ఇలాంటివి జరుగుతున్నప్పటికీ చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. గతంలో నాకు కూడా ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాలా వేధించాడు. అది కూడా మా అమ్మకు బాగోలేక ఆస్పత్రిలో చేర్పించిన టైంలో. ఆమె ఐసీయూలో ఉంది. విజిటింగ్ అవర్స్ ఉదయం 7-8 వరకు సాయంత్రం 4-5:30 గంటల వరకు ఉండేవి. నేను అమ్మని పరామర్శించి, షూటింగ్‌కి ఉదయం 9 గంటలకు వస్తానన్నా.. పోని ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం త్వరగా వెళ్లిపోతానన్నా సరే అనుమతి ఇచ్చేవాడు కాదు. దీని గురించి బయటకు చెబుదామంటే నాపై లేనిపోని పుకార్లు సృష్టించారు. అయితే చాలామంది వీటి గురించి పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే చేస్తున్న పని పోతాదేమోనని భయం' అని రిద్ధిమా పండిట్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment