బియాస్లో విగత జీవిగా జగదీష్
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గురువారం మరో మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్కు చెందిన జగదీశ్దిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకూ 19 మృతదేహాలు బటయపడ్డాయి. కాగా జగదీష్ ముదిరాజ్ (20) మృతదేహం లభ్యం కావటంతో అతని ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్‌లోని బంగారు మైసమ్మ బస్తీలో జగదీష్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. తండ్రి మల్లేష్ కొకొకోలా కంపెనీలో పని చేస్తున్నారు. జగదీష్ రెండో కుమారుడు. క్షేమంగా వస్తాడనుకున్న తమ కుమారుడు విగతజీవిగా మారటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బియాస్ నదిలో 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంత అయిన విషయం తెలిసిందే. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.