హోవ్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ససెక్స్ జట్టుతో సోమవారం మొదలైన డివిజన్–2 నాలుగు రోజుల మ్యాచ్‌లో గ్లామోర్గన్ జట్టుకు ఆడుతున్న శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి చేరువయ్యాడు. మరో తొమ్మిది పరుగులు సాధిస్తే గిల్ శతకం పూర్తవుతుంది.
వెలుతురు మందగించి తొలి రోజు ఆటను నిలిపివేసే సమయానికి గ్లామోర్గన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో మూడు వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఓపెనర్ డేవిడ్ లాయిడ్ (64 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం గిల్‌తోపాటు బిల్లీ రూట్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు!
Comments
Please login to add a commentAdd a comment