ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 పోటీల్లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సెంచరీతో (192 బంతుల్లో 102; 13 ఫోర్లు, సిక్స్) కదంతొక్కాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న రహానే.. గ్లామోర్గన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు.
ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో (73/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన రహానే.. సహచరుడు పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌తో (126 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రహానే, హ్యాండ్స్‌కోంబ్ సెంచరీలతో కదంతొక్కడంతో లీసెస్టర్‌షైర్ 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
40వ శతకం
ఈ మ్యాచ్‌లో రహానే చేసిన సెంచరీ అతనికి ఫస్ట్ కెరీర్‌లో 40వది. రహానే ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 40 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీల సాయంతో 13,387 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రహానే 1600 ఫస్ట్ క్లాస్ బౌండరీల మార్కును కూడా అందుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించిన రహానే
ఈ మ్యాచ్‌లో రహానే తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. 67 బంతుల్లో 6 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రహానేతో పాటు హ్యాండ్స్‌కోంబ్ కూడా ఓ మోస్తరు స్కోర్ (46) చేయడంతో లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది.
ఇంగ్రామ్ భారీ డబుల్
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గ్లామోర్గన్.. కొలిన్ ఇంగ్రామ్ భారీ డబుల్ సెంచరీతో (257 నాటౌట్) విరుచుకుపడటంతో 9 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కాగా, నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి లీసెస్టర్‌షైర్ 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యాండ్స్‌కోంబ్, లియామ్ ట్రెవస్కిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. లీసెస్టర్‌షైర్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment