టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే లీడర్‌షిప్ క్వాలిటీస్ గురించి అందరికీ తెలుసు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఏరకంగా భారత జట్టును గెలిపించాడో అందరం చూశాం. ప్రస్తుతం రహానే టీమిండియాలో భాగం కానప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో ముంబై జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. రహానేకు మంచి నాయకుడిగా పేరుండటంతో పాటు నిఖార్సైన జెంటిల్మెన్‌గానూ గుర్తింపు ఉంది. దేశవాలీ క్రికెట్‌లో రహానే యువ ఆటగాళ్లకు అత్యుత్తమ గైడ్‌లా ఉంటాడు.
కెప్టెన్‌గా వారికి అమూల్యమైన సలహాలు అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో రహానే ఆటగాళ్ల శ్రేయస్సు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ విషయంలో రహానే ఓ సందర్భంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా యశస్వికి (వెస్ట్ జోన్), సౌత్ జోన్ ఆటగాడు రవితేజకు మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో రహానే జైస్వాల్‌ను మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు.
For those who trolled him for sending Jaiswal out of the field, this is for you!
Ajinkya Rahane reveals the reason why he sent Jaiswal out of the field. pic.twitter.com/nMzobNkwwc— Riddhima (@RiddhimaVarsh17) October 26, 2024
ఒకవేళ ఆ సమయంలో రహానే అలా చేయకపోయుంటే యశస్విపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేది. యశస్వి శ్రేయస్సు కోసమే తాను అలా చేశానని రహానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్‌లో రహానే వెస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి భారీ డబుల్ సెంచరీ (264) చేశాడు.
ఇదిలా ఉంటే, యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. యశస్వి ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వి ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1300 పైచిలుకు పరుగులు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్‌లో) యశస్వి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment