
భారత క్రికెటర్ అజింక్య రహానేతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్‌షైర్ ఒప్పందం చేసుకుంది. హాంప్‌షైర్ జట్టు తరఫున ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా రహానే గుర్తింపు పొందనున్నాడు. మే, జూన్, జూలైలలో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లో రహానే ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్‌రమ్ స్థానంలో రహానేను తీసుకున్నారు. రాయల్ లండన్ వన్డే కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక మార్క్‌రమ్ ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టుతో చేరతాడు. 30 ఏళ్ల రహానే ఇప్పటివరకు భారత్ తరఫున 56 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment