ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ డెర్బీషైర్‌పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్‌సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్‌సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్‌సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్‌షైర్
54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.
టార్గెట్ 266
266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్‌ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పృథ్వీ షా
ఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు.
చదవండి: ఐదేసిన చహల్
Comments
Please login to add a commentAdd a comment