
రాజస్తాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి నెటిజన్ల అగ్రహనికి గురయ్యాడు. అతడి ప్రవర్తనపై అభిమానులు మండిపడుతున్నారు. ఎందకంత యాటిట్యూడ్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలేమి జరిగిందంటే.. ఐపీఎల్-2025లో భాగంగా ఆదివారం గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పరాగ్ పర్వలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్‌లో 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పరాగ్.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నా.. మ్యాచ్ అనంతరం అతడు గ్రౌండ్ స్టాప్‌తో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. మ్యాచ్ ముగిశాక బర్సాపర క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది పరాగ్ వద్దకు వచ్చి వచ్చి సెల్ఫీ అడిగారు. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం వచ్చి నిల్చొని పరాగ్ చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత.. వారివైపు కాస్త డిఫెరెంట్‌గా అతడు చూశాడు.
సెల్పీ దిగిన అనంతరం వారి మొబైల్‌ను చేతికి ఇవ్వకుండా విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు రియాన్ పరాగ్‌పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.
Attitude 🗿 Performance 🤡 pic.twitter.com/tNBZgSpRMA
— Sonu (@heyysonu_) March 31, 2025
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రా
RIYAN PARAG - ONE OF THE BEST CATCHES IN IPL EVER 👌 pic.twitter.com/hPm6S4tOgj
— Johns. (@CricCrazyJohns) March 30, 2025