SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్‌ సీరియస్‌ | CM Revanth Reddy Serious On SRH And HCA Controversy | Sakshi
Sakshi News home page

SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్‌ సీరియస్‌

Published Mon, Mar 31 2025 5:44 PM | Last Updated on Mon, Mar 31 2025 6:39 PM

CM Revanth Reddy Serious On SRH And HCA Controversy

సాక్షి,హైదరాబాద్‌ : హెచ్‌సీఏ- సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి  పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్‌ డీజీ కొత్తకోట శశ్రీకాంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్‌ సైతం స్పందించారు. 

అసలేం జరిగిందంటే?
ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్‌ 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం​ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌ రావు ఓ ఘాటు లేఖ రాశారు.

ఇలాంటి ప్రవర్తన సహించం
ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్‌ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్‌ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్‌ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.  

గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి  ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.

హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్‌
అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్‌ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్‌ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్‌ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్‌ తన ఈ-మెయిల్‌లో హైలెట్‌ చేశారు. 

కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement