
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ టెస్టుల్లో మూడు లేదా నాలుగో స్థానానికి సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బంతి స్వింగ్ అయితే ఆడటానికి గిల్ ఇబ్బంది పడుతున్నాడని చోప్రా తెలిపాడు. కాగా గిల్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్‌లో ఎక్కువ భాగం ఓపెనర్‌గానే ఉన్నాడు. ఇక జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఏకైక టెస్టులో కూడా గిల్ భారత తరపున ఓపెనింగ్ చేయునున్నాడు..
ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టుకు గిల్ భారత ఓపెనర్లలో ఒకడిగా ఉండబోతున్నాడు. కానీ అతడు ఓపెనర్‌గా అంతగా రాణించలేడని నేను భావిస్తున్నాను. అతడు మూడు లేదా నాలుగో స్థానంలో అత్యుత్తమంగా ఆడగలడు. మ్యాచ్ ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అటు వంటి సమయంలో పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఒకే వేళ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడితే.. అతడు ఒక మ్యాచ్‌లో విఫలమైనా తర్వాత తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పడు ఇంగ్లండ్‌తో ఒకే ఒక టెస్టు ఆడనున్నారు" అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!