ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్‌లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.
అయితే యంగ్ షెల్డన్ అనే సిట్‌కామ్‌తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.
16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..
యంగ్ షెల్డన్‌లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్‌కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.
యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment