Child actor
-
అయ్యో మాలికాపురం.. ట్రోలింగ్‌తో మానసిక వేదన
మాలికాపురం ఓటీటీలో అదరగొట్టిన మలయాళ సినిమా. ఇందులో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ప్రధాన పాత్రలో మెప్పించింది. ఈ బాలనటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2018, నైమర్, అరణ్మనై 4 వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన గు అనే హారర్ మూవీ ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిన్నారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా తన ఇంటి దగ్గరే ఇంటర్వ్యూ ఇచ్చింది.నటిపై ట్రోలింగ్అయితే సదరు యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వీడియోను కొందరు ఇష్టారీతిన కట్ చేస్తూ తప్పుడు థంబ్‌నైల్స్ పెడుతున్నారట! తను అన్న మాటలను వక్రీకరిస్తున్నారట! దీనిపై నటి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలోని ఒక పార్ట్‌ను మాత్రమే కట్ చేసుకుని తన కూతురిపై బురద చల్లుతున్నారని మండిపడ్డాడు. విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానసికంగా..ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతుర్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. దీనివల్ల తన పదేళ్ల చిన్నారి మానసిక ఆవేదనకు లోనవుతోందని తెలిపాడు. తన కూతురిపై ద్వేషం చిమ్మిన వీడియోలును వెంటనే సదరు ఛానల్స్ డిలీట్ చేయాలని డిమాండ్ చేయాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.సినిమా కోసం ఉపవాసంకాగా దేవానంద ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తొట్టప్పన్(2019) చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె మై సాంటా, మిన్నాల్ మురళి, టీచర్, మాలికాపురం వంటి అనేక చిత్రాల్లో నటించింది. మాలికాపురం సినిమాలో ఈ బాలనటి ఎలాగైనా శబరిమల వెళ్లాలనుకుంటుంది. చివరకు పేరెంట్స్ సాయం లేకుండా అనుకున్నది సాధిస్తుంది. అయితే ఈ సినిమా కోసం 75 రోజులపాటు ఉపవాసం ఉంది. పైగా తను శబరిమల వెళ్లడం కూడా అదే తొలిసారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. View this post on Instagram A post shared by Deva nandha jibin (@devanandha.malikappuram) చదవండి: పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి -
ఆరేళ్ల వయసుకే స్టార్‌గా మారిన చిన్నారి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌తో బిజీ!
వృద్ధి విశాల్.. ఈ పాప పేరు వృద్ధి విశాల్. ఆరేళ్ల వయసుకే స్టార్ అయిపోయింది. ఇటు సీరియల్స్.. అటు సిరీస్‌తో బిజీ బిజీగా ఉంటున్న ఈ చిన్నారి పరిచయం బ్రీఫ్‌గా.. వృద్ధి విశాల్ సొంతూరు.. కేరళ, కోచీలోని కుంబళంగి. నాన్న.. విశాల్ కణ్ణన్, అమ్మ.. గాయత్రి విశాల్. ఇద్దరూ కొరియోగ్రాఫర్లే. వృద్ధికి ఒక తమ్ముడున్నాడు. పేరు.. విద్యుత్ విశాల్. ఓ పెళ్లి వేడుకలో ‘రాములో రాములా.., వాతి కమింగ్’ పాటలకు వృద్ధి చేసిన డ్యాన్స్‌తో ఆ అమ్మాయి పాపులర్ అయింది. ఆ ఫాలోయింగ్ ఈ బేబీకి వాణిజ్య ప్రకటనల్లో మెరిసే ఛాన్స్‌ను ఇచ్చింది. వాణిజ్య ప్రకటనలు సీరియల్స్, సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి. ‘మంజిల్ విరింజ పువ్వు’ అనే సీరియల్ ద్వారా తొలిసారి బుల్లితెర మీద కనిపించింది. తర్వాత మలయాళ చిత్రం ‘సారా’తో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ‘పీకాబు’, ‘2018’, ‘కడువా’ సినిమాల్లో నటించింది. తమిళ్ సినిమా ‘కాఫీ విత్ కాదల్’లోనూ యాక్ట్ చేసింది. ఇటీవలే ‘తీరా కాదల్’తో వెబ్‌తెర మీదా ఎంట్రీ ఇచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. View this post on Instagram A post shared by Vriddhi Vishal (@_vriddhi_) చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా? -
హైలెస్సో హైలెస్సా...
‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్’’ అన్నారు మేకర్స్. -
చైల్డ్ ఆర్టిస్ట్ టూ హీరో.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ!
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన నటుడు విశ్వ కార్తికేయ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ స్టార్స్ వద్ద చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అంతే తన నటనతో నంది, ఇతర అంతర్జాతీయ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) బాల్యనటుడిగానే కాదు.. జై సేన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు.ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది. (ఇది చదవండి: పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!) ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్త్ అవర్ (Nth Hour) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో విశ్వ కార్తికేయ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. -
17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Panniru Rajkumar (@rajkumar_sara_arjun) -
లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్.. సాంగ్ విన్నారా?
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ చిత్రాన్ని వి. యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్..’ (జీవితం ఇంతందంగా ఉంది) అంటూ సాగేపాటని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి,పాట బాగుందని యూనిట్‌ని అభినందించారు. వి. యశస్వి సాహిత్యం అందించిన ఈపాటని కార్తీక్, శ్రీనిషా జయశీలన్పాడారు. తన్వి నేగి, నందిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ ప్రో డ్యూసర్: బి. శ్యామ్ కుమార్. -
నెట్టింట హల్చల్ చేస్తున్న 'భజరంగీ భాయ్‌జాన్' చిన్నారి వీడియో
2015లో విడుదలైన 'భజరంగీ భాయ్‌జాన్' సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన చిన్నారి మున్నీ పాత్ర గుర్తుందా? అదేనండి సల్మాన్ ఖాన్ భుజాల మీద వేసుకుని ఆడిపించుకునేవాడు, ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపించిన హర్షలి మల్హోత్రా. ఈ ఏడాది జూన్‌లో 13న తన పుట్టిన రోజు జరుపుకుని టీనేజ్‌లోకి అడుగుపెట్టిన హర్షలి... ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుని సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తరచూ తన డాన్స్ వీడియోలతో నెట్టింట హల్చల్ చేస్తున్న హర్షలి తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ సినిమాలోని సలామ్ ఆర్య పాటకు లింప్ సింక్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా ‘వీర్’ సినిమా 2010లో వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్, జరీన్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. హర్షాలి తాజాగా చేసిన ఈ వీడియోని 1.49 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వెరీ క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) చదవండి: RRR: జక్కన్న భారీ ప్లాన్.. 1000 కోట్లే లక్ష్యం.. ప్రమోషన్స్‌కే రూ.20 కోట్లు! -
విరుష్కలు వైరల్ చేసింది అతన్నే...
సాక్షి, ముంబై : ‘రోడ్డుపై ప్లాస్టిక్ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్‌బిన్ ఉపయోగించండి’ అంటూ ఓ వ్యక్తిపై అరుస్తున్న వీడియోను షేర్ చేసి విరుష్కలు వార్తల్లో నిలిచారు. అయితే చాలా మట్టుకు నెటిజన్లు అనుష్క, విరాట్ కోహ్లిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాన్ని పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేశారని తిట్టిపోస్తున్నారు. అయితే అనుష్క నోరు పారేసుకున్న ఆ వ్యక్తి అర్హాన్ సింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. అర్హాన్ సింగ్.. 90వ దశకంలో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. షారుఖ్ ఖాన్-మాధురీ దీక్షిత్ జోడీగా నటించిన ‘ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్’లో హీరో మేనల్లుడి పాత్రలో అర్హాన్ నటించి మెప్పించాడు. అంతేకాదు రాజా, దేఖ్ బాయ్ దేఖ్, 2010లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘పాఠశాల’లోనూ అర్హాన్ నటించాడు. ప్రస్తుతం అర్హాన్ సింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారటంతో అతనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షమాపణలు చెబుతూ... తాను చేసిన తప్పుపై అర్హాన్ సింగ్ ఫేస్బుక్ ద్వారా క్షమాపణలు చెప్పారు. అయితే, అనుష్క, విరాట్ తన పట్ల ప్రవర్తించిన తీరును మాత్రం విమర్శించాడు. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే.. అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి కనీస స్పృహలేకుండా నాపై కేకలు వేసింది. ఇది మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్హాన్ తల్లి కూడా తీవ్రంగా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పేనని, కానీ.. అతన్ని పట్టుకుని రోడ్డుపై తిట్టడం సబబు కాదని అర్హన్ తల్లి పేర్కొన్నారు. -
నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!
అవిశ్రాంతం అరవై తర్వాత ‘బాల నటుడిగా సినిమా తెర మీద నటించిన దానికంటే ఎక్కువగా జీవితంలో నటించాను’ - ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన వ్యక్తి మోహన్‌కందా. 1968 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఎస్ అధికారికి ఇప్పుడు 69 ఏళ్లు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ‘ఉద్యోగ విరమణ’ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం, దినచర్య వివరాలు ఆయన మాటల్లోనే... ఉద్యోగంలో ఉన్నప్పుడు- విరమణ తర్వాత, దేశంలో ఉన్నప్పుడు - విదేశాల్లో ఉన్నప్పుడు, శీతాకాలం- ఎండాకాలం అనే తేడాలేవీ నా వ్యక్తిగత దైనందిన జీవితంలో కనిపించవు. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం, వ్యాయామం, స్నానం, పూజ, బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే సమయాల వరకు ఎటువంటి మార్పు లేదు. అప్పట్లోలా ఆలస్యం అవుతుందేమోననే ఆందోళన లేకపోయినప్పటికీ సమయం మునుపటికంటే మించడం లేదు. నా క్లాక్ అలా సెట్ అయిపోయినట్లుంది. ఈ రోజంతా ఖాళీ అనే పరిస్థితి ఇంతవరకు నేను రానివ్వలేదు. ఇప్పుడు కూడా నాకిష్టమైన పనులతో రోజంతా తీరికలేకుండా గడుపుతున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పటిలాగానే దేహాన్ని, మెదడుని ఖాళీగా ఉంచడం లేదు. ప్రయాణానికి రెలైక్కేటప్పుడే గమ్యం చేరాక రైలు దిగాలని మనకు తెలుసు. ఉద్యోగ విరమణ కూడా అలాంటిదే. రైలు దిగిన తర్వాత మనం నిర్దేశించుకున్న పనులు చక్కబెట్టుకున్నట్లే ఉద్యోగ విరమణ తరువాత చేయాలనుకున్న పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి పని నా నిర్ణయమే... ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలో నా ప్రమేయం లేకుండానే నిర్ణయమై ఉంటాయి. వాటిని అమలు చేయడం, ఆచరణలో నేర్పరితనంతో నాకంటూ ఒక తరహా పనితీరును వ్యక్తం చేయడమే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం నేను రోజుకు ఒక గంట బ్రిడ్జి గేమ్ మీద పుస్తకాలతో గడుపుతాను. నాకిష్టమైన కాస్మాలజీ అధ్యయనంలో మునిగిపోతాను. అలాగే నాకు ఇష్టమైనవి, ఉద్యోగంలో ఉన్నప్పుడు చదవడానికి సమయం చాలక పక్కన పెట్టిన ఐన్స్టీ పరిశోధన ... ‘గాడ్స్ ఓన్ ఈక్వేషన్’ నంబర్ థియరీలో అద్భుతమైన సమీకరణం మీద రాసిన... ఫెర్మాస్ లాస్ట్ థీరమ్’ వంటి పాతిక పుస్తకాలు చదివాను. అలాగే నాకు తెలుసుకోవాలని ఉన్న ప్రతి అంశాన్నీ విస్తృతంగా తెలుసుకుంటూ, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాను. గతంలో నేను ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్’ అంశం మీద సివిల్స్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ణి. ప్రతి క్లాసుకీ తగినంత విషయసేకరణకు చాలా శ్రమించి క్రోడీకరించాను. ఆ తర్వాత దానిని ఓ పుస్తకంగా తెస్తే చాలా మందికి అందుబాటులోకి వస్తుందని పుస్తకం రాశాను. సహకార వ్యవస్థ మీద ఓ పుస్తకం రాశాను. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రాస్తున్నాను. ప్రస్తుతం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయానికి, వ్యవసాయరంగంలోనూ, పాలనలోనూ, విపత్తుల నిర్వహణలోనూ, అవసరమైన కార్యాచరణ మీద కొత్త ఆలోచనలను పంపిస్తున్నాను. నా జీవితంలోని కీలకమైన సంఘటనలను, ఉద్యోగ జీవితాన్ని ‘మోహన మకరందం’ పేరుతో రాశాను. రిటైరయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఐదేళ్లపాటు సభ్యుడిగా చేశాను. ప్రతిదీ సాధ్యమే! మనిషి జీవితంలో ఫలానా పని అసాధ్యం అని ఏదీ ఉండదు. తప్పనిసరి అంటే చేసి తీరుతారెవరైనా. చేయకపోయినా ఫరవాలేదనుకుంటే చేయరు. నా మట్టుకు ఇంత వరకు అసాధ్యం అని వదిలేసిన పని ఒక్కటీ లేదు. ఎవరికైనా సరే ‘ఏమి’ చేయాలనే విషయంలో స్పష్టత వస్తే ‘ఎలా’ చేయాలనే ప్రణాళిక దానంతట అదే వస్తుంది. ఏం చేయాలన్నది తెలియకే చాలా మంది అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత జీవితాన్ని ఎలా గడపాలంటూ ఆందోళన పడుతుంటారు. పైగా ప్రసారమాధ్యమాల్లో కూడా ‘విశ్రాంత’ అనే పదం వాడుతుంటారు. ఆ పదంతోనే చాలా మంది ఇక చేయాల్సిందేమీ లేదనే భావనలోకి వచ్చేస్తున్నారు. ఇది విశ్రాంత జీవనం కాదు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం. ఉద్యోగానికి ముందు ఆనందంగా జీవించలేదా? ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే! తేడా అంతా ఉద్యోగానికి ముందు జీవితం నేర్చుకోవడానికి వినియోగిస్తాం, ఉద్యోగ విరమణ తర్వాత నేర్చుకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి చక్కటి వ్యాపకాలను నిర్దేశించుకుంటాం. నేనదే చేస్తున్నాను. ప్రణాళిక ఉండాలి! పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా ప్రతి దానికీ ఓ ప్రణాళిక పెట్టుకుంటాం. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికీ ఓ ప్రణాళిక ఉండాల్సిందే. జీవితంలో మన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో దేనిని ఎంచుకోవాలనే పరిణతి ఈ వయసుకి వచ్చి తీరాలి. ఇన్నేళ్ల అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, శక్తిని కలిపి మనం ఏం చేయగలమో దానిని ఎంచుకునే అవకాశం ఎప్పుడూ మన ముందు ఉంటుంది. దానినే పట్టుకుని ముందుకు పోవాలి తప్ప... దారీ తెన్నూ లేకుండా పోకూడదు. ఒక్కో సి.ఎం. ఒక్కో తీరు... నా సర్వీస్‌లో ఎందరో సీఎంల దగ్గర పనిచేశాను. నా పని తీరుతో వారికి ఇబ్బంది కలగనివ్వలేదు. నా చుట్టుపక్కల అందరినీ సౌకర్యంగా ఉండేటట్లు చూడడంలో సఫలమయ్యాను. అలాగే ఇంట్లో కూడా. నా భార్య ఉషకు, కానీ పిల్లలకు కానీ నా మీద పెద్ద కంప్లయింట్లు ఉండవు. నేను నిద్రపోయేటప్పుడు నా కోసం వచ్చిన ఫోన్‌కాల్స్‌కు జవాబు చెప్పాల్సి రావడాన్ని మాత్రం మా ఆవిడ దెప్పుతూ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి నుంచి తెల్లవారు జామున కాల్స్ వచ్చేవి, ఒక ముఖ్యమంత్రి నుంచి అర్ధరాత్రి వరకు కాల్స్ వస్తూ ఉండేవి. నన్ను నిద్రలేపకుండా వాటిని బదులు చెప్పడం కోసం తన నిద్ర పాడయ్యేదని ఉష ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది. ఉద్యోగ జీవితంలో నన్ను ఆదేశించే పై అధికారులు, అమాత్యులను నొప్పించకుండా నేను నొచ్చుకోకుండా మెలిగాను. వృత్తిపరమైన ఆదేశాలను ఎంత నిబద్ధతతో అమలు చేశానో, వ్యక్తిగత ఆదేశాలను అంతే సున్నితంగా తోసివేస్తూ వెన్ను వంచకుండా నా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాను. ‘నేను’ అంటే మోహన్ కందా అని మర్చిపోకుండా జీవించాను, జీవిస్తున్నాను.